pizza
Karthikeya, Arjun Jandhyala film regular schedule from 17 January
17 నుంచి ఒంగోలులొ ‘ఆర్‌ ఎక్స్‌–100 ’ ఫేమ్‌ కార్తికేయ కొత్త చిత్రం తొలి షెడ్యూల్‌!
You are at idlebrain.com > news today >
Follow Us

16 January 2019
Hyderabad

‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 17 నుంచి ఒంగోలులో ప్రారంభంకానుంది.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ``మా ‘ఆర్‌ ఎక్స్ 100’ విడుద‌లైన త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నాను. వాటిలో నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. మంచి రోజు చూసి ముహూర్తం షాట్ తీశాం. ఈ నెల 17 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. షూటింగ్ లొకోష‌న్‌లోకి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను`` అని అన్నారు.

దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ `‘నేను బోయ‌పాటి శ్రీనుగారి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేశాను. ఆయ‌న నాకు గురువుగారు మాత్ర‌మే కాదు. సోద‌ర స‌మానులు. కార్తికేయ‌గారు సినిమాను న‌మ్మి చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆయ‌న వ‌ల్ల‌నే ఈ చిత్రం ఇంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కింది. నిర్మాత‌లు క‌థ మీద న‌మ్మ‌కంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేయాల‌నే ప్యాష‌న్‌తో ఉన్నారు. క‌థానుగుణంగా ఒంగోలులో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాం`` అని చెప్పారు.

నిర్మాతలు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ``ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ నెల 17 నుంచి ఫిబ్ర‌వ‌రి 8 వ‌ర‌కు ఒంగోలు ప‌రిస‌రాల్లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రిస్తాం. ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను, రెండు పాట‌ల‌ను తెర‌కెక్కిస్తాం. హీరోయిన్ ఎంపిక జ‌రుగుతోంది. సినిమా టైటిల్‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం`` అని అన్నారు

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved