pizza

Karthikeya 2 characters introduction
నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2' లో క్యారెక్టర్స్ పరిచయం చేసిన దర్శక నిర్మాతలు..

You are at idlebrain.com > news today >
Follow Us

10 June 2022
Hyderabad

నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2' లో క్యారెక్టర్స్ పరిచయం చేసిన దర్శక నిర్మాతలు..

వరుస విజయాలతో జోరుమీదున్న ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కార్తికేయ‌ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఈ మోషన్ పోస్టర్ పై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ‌ 2పై ప్రశంసల వర్షం కురిపించారు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కార్తికేయ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయ గా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. వీళ్ళ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2.

నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం:
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం - చందు మెుండేటి
బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved