pizza
Hero Kartikeya Contributes 2 Lakhs to ‘Corona Crisis Charity’
"మనకోసం నిలబడే వారికోసం కోసం మనం నిలబడుదామంటూ" సినీ కార్మికులకి 2 లక్షల విరాళమిచ్చిన హీరో కార్తికేయ !!
You are at idlebrain.com > news today >
Follow Us

29 March 2020
Hyderabad


"మనకోసం నిలబడే వారికోసం కోసం మనం నిలబడుదామంటూ" సినీ కార్మికులకి 2 లక్షల విరాళమిచ్చిన హీరో కార్తికేయ !!

క‌రోనా వ్యాప్తి భ‌యం కార‌ణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో 'క‌రోనా క్రైసిస్ చారిటీ' (సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని, 'క‌రోనా క్రైసిస్ చారిటీ' చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేపడుతుందని చెప్పారు.

ఆయన పిలుపుకి మద్దతుగా నిలబడిన ఎంతో మంది తారలతో పాటు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ రూ. 2 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

ఈ సందర్భంగా, "షూటింగుల్లో భాగంగా సెట్ లో ఎంతో కష్టపడే కార్మికులకు ఇలాంటి ఆపద సమయంలో తోడుగా ఉండడం, వీలైనంత సహాయం చేయడం మన బాధ్యత. రోజంతా మనకోసం నిలబడే వారికోసం మనమిప్పుడు నిలబడదాం. అలాగే క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కోవ‌డానికి ప్రభుత్వం వారు అమలుపరుస్తున్న నియమాలని పాటిద్దాం, కలిసికట్టుగా ఒకే మాట మీదుండి అంద‌రూ విడివిడిగా ఇంటిప‌ట్టునే సుర‌క్షితంగా ఉంటూ సంతోషంగా ఉందాం" అని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

Hero Kartikeya Contributes 2 Lakhs to ‘Corona Crisis Charity’

While the Coronavirus outbreak has left thousands of cine workers in the lurch due to the postponements of film and production, Megastar Chiranjeevi initiated CCC (Corona Crisis Charity) a fund meant for the aid of daily wage earners, who need the utmost support of the industry because of the ongoing lockdown.

Also, he gave a call to all the celebs and members of the industry to donate an amount to arrange the needful for the needy in this Crisis time.

Responding to the same, Hero Kartikeya Gummakonda has donated Rs 2 lakhs to the fund & addressed that it’s our time to stand for the people who stand all the time in our sets to make everything possible.

Let’s seriously stay at home & bring everything under control together, adds the young Talented Actor.


 

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved