pizza
Kashish Khan Interview about Anubhavinchu Raja
ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. ‘అనుభవించు రాజా’ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కశిష్ ఖాన్
You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2021
Hyderabad

 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశిష్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు.

ఆడిషన్స్ కోసం నా మేనేజర్ సతీష్ ఇన్ స్టాగ్రాంలో మెసెజ్ చేశారు. కానీ మొదట నమ్మలేదు. అలా మూడు నెలలు రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇచ్చాక ఆడిషన్ చేశారు. సెలెక్ట్ అయ్యాను.ఈ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తాను. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను.

నాకు ఇదే మొదటి సినిమా. లైట్స్, కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. కానీ రాజ్ తరుణ్ ఎంతో సహకరించారు. అన్ని విషయాల్లో సాయం చేశారు. ఆయన దగ్గరి నుంచి ఎంతో నేర్చుకున్నాను.

నా మొదటి చిత్రం అన్నపూర్ణ బ్యానర్‌లో రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేసినందుకు సుప్రియ మేడంకు థ్యాంక్స్. ఆమె లేడీ బాస్. సెట్‌లో అందరినీ బాగా చూసుకునే వారు. ఎంతో సురక్షితంగా అనిపించింది.

డైరెక్టర్ శ్రీనుకు ఏం కావాలో అది బాగా తెలుసు. ఆయనకు క్లియర్ విజన్ ఉంది. అందుకే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు. ఏం కావాలి.. ఎలా చేయాలని చెప్పేవారు. మేం చేసేవాళ్లం. సెట్ అంతా సందడి వాతావరణంగా ఉండేది. సినిమాల్లో కూడా అది కనిపిస్తుంది.

ఇప్పటి వరకు మూడు పాటలు వచ్చాయి. నీ వల్లేరా అనే పాట నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రేక్షకులు ఆశించవచ్చు.

షూటింగ్ కంటే రెండు వారాల ముందే నా డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేశాను. నా అసిస్టెండ్ డైరెక్టర్లు ఎంతో సాయం చేశారు. ఒక్కో పదాన్ని ఎలా పలుకుతారో తెలుసుకున్నాను. చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేశాను.

డబ్బింగ్‌లో తెలుగు సినిమాలు చూశాను. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. నాకు ప్రతీ పాత్రను పోషించాలని ఉంది. సింపుల్ నుంచి గ్రాండియర్ వంటి కారెక్టర్‌ను పోషించాలని ఉంది. యాక్టర్ అయితే ఈ ఒక్క జీవితంలోనే ఎన్నో పాత్రలను పోషించవచ్చు. అందుకే నేను నటిగా మారాను.

నా మొదటి సినిమా విడుదల కాబోతోందన్న ఆనందంగా ఉంది.కానీ నర్వస్‌గా ఫీలవుతున్నాను. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఎమోషనల్ సీన్స్ చేయడం నాకు చాలా కష్టంగా మారింది. అదే నాకు సవాల్ అనిపించింది. తెలుగు భాష కూడా చాలెంజింగ్‌గా అనిపించింది.

నాగార్జున గారు రూంలోకి ఎంట్రీ అయితే అందరూ ఆయన్ను చూస్తుంటారు. నేను ఆయన్ను చూసి ఆ! అంటూ ఆశ్చర్యపోయాను. ఆయన నా ముందున్నారు అనే ఫీలింగ్‌‌లో ఉండిపోయాను.

ఈ సినిమా మొదటి నుంచి సుప్రియ మేడం మాతో ప్రయాణించారు. ఆమె ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved