pizza
Krishnakanth about Padi Padi Leche Manasu
ట్యూన్ల‌కు రాయ‌డ‌మే నాకు సులువు - కృష్ణ కాంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 December
Hyderabad

ఓ వైపు ఉద్యోగం చేస్తూ, మ‌రో వైపు పాట‌లు రాస్తున్న ర‌చ‌యిత కృష్ణ‌కాంత్‌. కృష్ణ‌గాడివీర ప్రేమ‌గాథ‌, మ‌ళ్లీరావే, ట్యాక్సీవాలా, తాజాగా ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమాల‌కు రాశారు. ఇంకా ప‌లు సినిమాలు ఆయ‌న చేతిలో ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న `ప‌డిప‌డి లేచే మ‌న‌సు` గురించి కృష్ణ‌కాంత్ బుధ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు.

కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ ``నేను కాదు.. నా ప‌ని మాట్లాడాల‌నుకునే తత్వం నాది. అందుకే మీడియాలో ప‌నిచేస్తున్నా, మీడియాలో ఎంతో మంది మిత్రులున్నా నేను ఎప్పుడూ ప్రెస్ ముందుకు రాలేదు. ఆడియో వేడుక‌ల్లోనూ ఎక్కువ‌గా చెప్ప‌ను. ఈ ఏడాది దాదాపు 65 పాట‌లు రాశాను. హ‌ను రాఘ‌వ‌పూడితో తొలి నుంచీ రాస్తూనే ఉన్నా. ఈ సినిమాకు ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. నాకు వేటూరిగారు స్ఫూర్తి. వేటూరిగారు సృష్టించిన‌న్ని ప‌దాలు మ‌రెవ‌రూ సృష్టించ‌లేదు. రిక్షా తొక్కేవాడికి కూడా అర్థ‌మ‌వుతాయి. శాస్త్రిగారంటేనూ ఇష్ట‌మే. ఆయ‌న పాట‌లు రెండో సారి వింటున్న‌ప్పుడు ఇంత అర్థం అందులో ఉందా అని అనిపిస్తుంది. నేను ఇప్ప‌టిదాకా ఎన్ని పాట‌లు రాసినా, వాటిలో చాలా వ‌ర‌కు మెలోడీలే రాశాను. ద‌ర్శ‌కుడు వివ‌రించే స‌న్నివేశాన్ని బ‌ట్టి, క‌థ‌ను బ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టు పాట రాస్తాను. `ప‌డిప‌డి లేచే మ‌న‌సు` చాలా గొప్ప‌గా ఉంటుంది. ఇండియ‌న్ స్క్రీన్ మీద ఇప్ప‌టిదాకా అలాంటి కాన్‌ఫ్లిక్ట్ రాలేదు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న మ్మ‌కం ఉంది. గ‌త ఐదేళ్లుగా మెలోడీ పాట‌ల‌కు చాలా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ప్ర‌స్తుతం జెర్సీ, క‌ల్కీ, ప్ర‌భాస్ 20.. చిత్రాల‌కు పాటలు రాస్తున్నా. తెలుగులో కీర‌వాణిగారు, ద‌క్షిణాదిన రెహ‌మాన్‌గారితో త‌ప్ప అంద‌రితోనూ ప‌నిచేశాను. ట్యూన్ల‌కు రాయ‌డ‌మే నాకు సులువు. అలా కాకుండా విడిగా రాయ‌డానికి ఎప్పుడూ ప్ర‌య‌త్నించ‌లేదు. ఒకే ఒక్క‌సారి మ‌ణిర‌త్నంగారి ద‌గ్గ‌ర చేశానంతే`` అని చెప్పారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved