pizza
Kumari Mallika Releasing on 12 Feb
"కుమారి 21 ఎఫ్" తరహా చిత్రం "కుమారి మల్లిక"
You are at idlebrain.com > news today >
Follow Us

4 February 2016
Hyderaba
d

ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన "కుమారి 21 ఎఫ్" తరహాలో.. ఆస్కార్ కృష్ణ దర్సకత్వంలో రూపొంది ఘన విజయం సొంతం చేసుకున్న కన్నడ చిత్రం "మిస్ మల్లిక". రూపా నటరాజన్, రంజన్ శెట్టి, శ్వేత, విక్రమ్ నటించిన ఈ చిత్రం తెలుగులో "కుమారి మల్లిక" పేరుతో విడుదలవుతోంది. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై డి.పూర్ణకళ-తపస్య కృష్ణ సమర్పణలో బెజవాడ రమణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. వంశీకిరణ్ రెడ్డి-స్వర్ణ శ్రీనివాస్ నిర్మాణ సారధులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత బెజవాడ రమణ మాట్లాడుతూ.. "సైబర్ క్రైమ్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం కన్నడలో సంచలన విజయం సాధించింది. బెంగళూర్ లో 365 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు!!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved