pizza
Kurra Thoofan in regular shooting
రెగ్యులర్‌ షూటింగ్‌లో 'కుర్రతుఫాన్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2016
Hyderaba
d

సిక్స్‌ప్రెండ్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మాస్టర్‌ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకుడు డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి రూపొందిస్తున్న చిత్రం 'కుర్రతుఫాన్‌'. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేశారు.

దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా ప్రారంభించి చాలా రోజులవుతుంది. మంచి అవుట్‌పుట్‌ కోసమే చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. చిత్రీకరణ విషయంలో దేనికీ కాంప్రమైజ్‌ అవ్వడం లేదు. ఈ చిత్రం నాతో పాటు సినిమాలో నటించే చాలా మందికి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం కావాలని..ది బెస్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నాము. అందువల్లే చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. ఈ సెప్టెంబర్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. అక్టోబర్‌లో ఆడియోను విడుదల చేసి, సంక్రాంతికి లేదా సమ్మర్‌కి చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాము..అని అన్నారు.

గాధె తరుణ్‌, తేజ్‌, భావన, హరిక్రిష్ణ, మాస్టర్‌ శ్రీరామచంద్ర, బ్రహ్మానందం, ఆలీ, ఉత్తేజ్‌, రాజీవ్‌ కనకాల, రచ్చరవి, ఘంట విజయ్‌, శ్రీచరణ్‌, సిద్దూ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపాల్‌ సామ్రాజ్‌; సంగీతం: టి.పి. భరద్వాజ్‌; పాటలు: చంద్రబోస్‌, విజయ్‌కుమార్‌; ప్రొడక్షన్‌: మహేష్‌, నిర్మాణం: సిక్స్‌ఫ్రెండ్స్‌ యూనిట్‌; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: డా|| క్రిష్ణమోహన్‌ గొర్రెపాటి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved