pizza
Krishnagaadi Veera Premagaadha audio by Lahari music
లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదలవుతున్న 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఆడియో
You are at idlebrain.com > news today >
Follow Us

12 January 2016
Hyderabad

ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్‌ ద్వారా ఈమధ్యకాలంలో సూపర్‌హిట్‌ ఆడియోలు చాలా రిలీజ్‌ అయ్యాయి. ముఖ్యంగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌లో నిర్మించిన 'లెజెండ్‌', '1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలు మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ బేనర్‌లో నాని హీరోగా, మెహరీన్‌ హీరోయిన్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం ఆడియోను కూడా లహరి మ్యూజిక్‌ సంస్థ రిలీజ్‌ చెయ్యబోతోంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ జనవరి 18న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

ఈ సందర్భంగా లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ - '''లెజెండ్‌' నుంచి 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రాల ఆడియోలను మా లహరి మ్యూజిక్‌ ద్వారానే రిలీజ్‌ చేశాం. అలాగే నాని హీరోగా వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాల ఆడియోలు కూడా మా సంస్థ ద్వారానే విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు నాని హ్యాట్రిక్‌ చిత్రంగా 'కృష్ణగాడి వీరప్రేమగాధ' ఆడియోను కూడా మేమే రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్కూల్‌ నుంచి వచ్చిన విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రంలోని పాటలను చాలా డిఫరెంట్‌గా చేశారు. డెఫినెట్‌గా నానికి ఇది మరో సూపర్‌హిట్‌ ఆడియో అవుతుంది. ఈ చిత్రం ఆడియో హక్కులు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకరలకు ఈ సందర్భంగా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved