pizza
Legend Mike Tyson, Liger Vijay Deverakonda Met Face To Face For USA Schedule
‘లైగర్‌’ అమెరికా షెడ్యూల్‌లో తలపడనున్న విజయ్ దేవరకొండ, మైక్ టైసన్
You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2021
Hyderabad

Legend Mike Tyson is making his Indian cinema debut with the most anticipated Pan India sports action film LIGER (Saala Crossbreed) starring the happening hero Vijay Deverakonda and being helmed by dashing director Puri Jagannadh. The unbeatable icon, known for his intimidating ferocious demeanour and impeccable striking prowess, is playing a significant and mighty role in the film.

The big day has arrived. The team is currently in USA to shoot the crucial sequences involving Legend Mike Tyson and Liger Vijay Deverakonda. The shooting schedule has begun today and they are canning these important scenes in a grand manner. The poster shows candid moment of Tyson and Vijay. They are seen all smiles, but they will not be same, when director calls 'action' to shoot their portions, as both play intense roles. They together are going to set the screens on fire.

"And then they met- face to face! Absolute fire 🔥The Legend vs Liger 👊🏻 #Liger #USAscheduleBegins 💥 @MikeTyson @TheDeverakonda #PuriJagannadh @karanjohar @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects @IamVishuReddy, " reads the statement of the team.

LIGER will also feature numerous foreign fighters. In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions.

Given it is one of the craziest Pan India projects and moreover The Great Mike Tyson on board, Puri connects and Dharma Productions are making the film on a grand scale.

The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.

Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.

Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.

Liger is in last leg of shooting and the makers are planning to release the movie in first half of 2022.

Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.

Technical Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta
Banners: Puri connects and Dharma Productions
DOP: Vishnu Sarma
Art Director: Jonny Shaik Basha
Editor: Junaid Siddiqui
Stunt Director: Kecha

‘లైగర్‌’ అమెరికా షెడ్యూల్‌లో తలపడనున్న విజయ్ దేవరకొండ, మైక్ టైసన్

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ పంచ్‌లోని పవర్ అందరికీ తెలిసిందే. అలాంటి మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నారు.

విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాకు వెళ్ళింది. నేడు అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. షూటింగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌లు నవ్వుతూ కనిపించారు. కానీ ఒక్కసారి డైరెక్టర్ యాక్షన్ అని చెబితే మాత్రం సీన్ మారిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్‌ అంచనాలు మించేలా ఉంటాయి.

ఒకరికొకరు వారు ఎదురుపడితే అగ్గి రాజుకున్నట్టే.. ది లెజెండ్ వర్సెస్ లైగర్ ఫైటింగ్ సీక్వెన్స్ మొదలు అంటూ చిత్రయూనిట్ తెలిపింది.

మైక్ టైసన్‌తో కలిసి ఉన్న ప్రతీక్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మెమోరీస్‌గా గుర్తు పెట్టుకుంటున్నాను. అవి ఎప్పటికీ నాకు ప్రత్యేకమే అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

లైగర్‌లో ఎంతో మంది విదేశీ ఫైటర్లు కూడా ఉన్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

మైక్ టైసన్ రాకతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు కూడా మారిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.

లైగర్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం
దర్శకుడు : పూరి జగన్నాథ్
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్ : పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్ : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్ బాషా
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్ : కెచ్చా

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved