pizza
చక్రి మృతికి సంతాపం తెలిపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
You are at idlebrain.com > news today >
Follow Us

15 December 2014
Hyderabad

గాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్న చక్రి హఠాత్తుగా మృతి చెందడం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం తెలియజేసింది. తనదైన బాణీలతో తెలుగు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయో పాటలందించిన చక్రి మనమధ్య లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మనమధ్య లేకపోయినా...ఆయన సంగీతమందించిన ప్రతీ పాట...చిరకాలం వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి చ‌క్రి ఈరోజు ఇలా హ‌ఠార్మ‌ణం చెంద‌టం తీవ్రంగా కలచివేసింది. చ‌క్రి మ‌ర‌ణం జీర్ణించుకోలేనిది. చ‌క్రి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ, వారి కుటుంబ స‌భ్యుల‌కి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపాన్ని తెలియజేస్తోంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved