pizza
Maanas about Premikudu
‘ప్రేమికుడు’ మంచి కమర్షియల్ మూవీగా మెప్పిస్తుంది - మానస్
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2016
Hyderaba
d

డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్, సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రేమికుడు’. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో మానస్ గురువారం పాత్రికేయులతో సినిమా సంగతులు గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ ‘’బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించాను. కాయ్ రాజా కాయ్, గ్రీన్ సిగ్నల్ వంటి చిత్రాల్లో నేను కూడా లీడ్ రోల్స్ లో ఒక లీడ్ రోల్ చేస్తూ వచ్చాను. అయితే ప్రేమికుడు చిత్రం నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు శ్రీ. విలేజ్ లోని ఉండే హీరో ఉద్యోగం కోసం సిటీ వచ్చినప్పుడు హీరోయిన్ పరిచయం అవుతుంది. అయితే ఆమె కొన్ని సమస్యల్లో ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు. తన లవర్ సమస్యను తీర్చి ఆమె ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేదే కథ. డైరెక్టర్ కళా సందీప్ సినిమాను చాలా చక్కగా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ లా అందరికీ తప్పకుండా నచ్చే చిత్రమవుతుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. ప్రస్తుతం డీల్ విత్ ధనలక్ష్మి చిత్రంలో నటిస్తున్నాను. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీగారి దర్శకత్వంలో రూపొందుతోన్న నక్షత్రం చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనపడతాను’’ అన్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved