pizza
Madhura Wines to release on September 17
సెప్టెంబర్ 17న విడుదల కానున్న 'మధుర వైన్స్'..
You are at idlebrain.com > news today >
Follow Us

20 August 2021
Hyderabad

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్... గతం, తిమ్మరుసు లాంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమా కి అసోసియేట్ అవ్వడం తో  ఇండస్ట్రీ లో  ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది...త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయి అని..మధుర వైన్స్
సినిమా కి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి అని.. సినిమా ఆహ్లాదకరంగా ఉంటుందని ధీమాగా చెప్తున్నారు మేకర్స్...

సెప్టెంబర్ 17న మధుర వైన్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చెప్పారు...

ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులు

టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం జయకిషోర్.బి
నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలు
కో ప్రొడ్యూసర్: సాయి శ్రీకాంత్ చెరువు
బ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్
సంగీత దర్శకుడు: కార్తిక్ rodriguez, జయ్ క్రిష్
సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.CH
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : అమర్ నాథ్ చావలి
ఎడిటర్: వర ప్రసాద్.ఎ
PRO: ఏలూరు శ్రీను
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లి చెరుకూరి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved