pizza
Maharshi pre release function on 1 May
మే 1న సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
You are at idlebrain.com > news today >
Follow Us

24 April 2019
Hyderabad

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య సాయంత్రం 6 గంటల నుండి ఈ ఫంక్షన్ జరగనుంది.

‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..’
సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో పాట విడుదల
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా, బుధవారం ఈ చిత్రంలోని నాలుగో పాటను విడుదల చేశారు. ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ అంటూ సాగే పాటను శ్రీమణి రచించగా దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్ పాడారు. సూపర్‌స్టార్ మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు’ అనే పాటను శంకర్ మహదేవన్ పాడారు. 20 సంవత్సరాల తర్వాత ‘మహర్షి’ చిత్రంలో శంకర్ మహదేవన్ పాడడం విశేషం.

ఈ పాటపై గాయుకుడు శంకర్ మహదేవన్ స్పందిస్తూ ‘‘సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఫస్ట్ ఫిల్మ్ ‘రాజకుమారుడు’లో ‘బాలీవుడ్ బాలరాజు..’ అనే పాట పాడే అవకాశం వచ్చింది. ఒక హిస్టారికల్ మూమెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా ‘మహర్షి’లో మళ్ళీ నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా ఫ్రెండ్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ‘పదర పదర పదరా..’ అనే పాటను ఈ సినిమాలో పాడడం జరిగింది. శ్రీమణి ఈ పాటను రాశారు. ఎమోషనల్‌గా, ఇన్‌స్పిరేషనల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే పాట ఇది. ఈ పాట పాడే అవకాశం నాకు రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ సాంగ్. ఈ సందరేంగా డైరెక్టర్ వంశీని కంగ్రాట్యులేట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా మే 9న విడుదల కాబోతోంది’’ అన్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved