pizza
Malini & Co news
You are at idlebrain.com > news today >
Follow Us

10 August 2015
Hyderabad

దేశవ్యాప్తంగా భారి ఎత్తున రిలీజ్ కు రెడి అవుతున్న పూనమ్ పాండే 'మాలిని అండ్ కొ '

పూనమ్‌ పాండే, మిలన్ ప్రధాన పాత్రల్లో, మనీషా ఆర్ట్స్‌ అండ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై, కిషోర్‌ రాఠి సమర్పణలో, వీరు.కె దర్శకత్వంలో మహేష్‌ రాఠి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాలిని అండ్‌ కో’.ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా భారి ఎత్తున రిలీజ్ చేశేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 14న రిలీజ్ కావల్సివున్న ఈ చిత్రం వాయిదా పడింది. ఈ సందర్భంగా: నిర్మాతలు కిషోర్‌రాఠి, మహేష్‌రాఠిలు మాట్లాడుతూ: తెలుగులో సంచలన తార పూనమ్‌ పాండే నటించిన ‘మాలిని అండ్‌ కో’సినిమా, తమిళ్ లో 'మిధాలి ఆండ్ కొ 'గాను మలయాళంలో 'మిన్నత్ మైధిలీ ' గాను తెరకెక్కింది. ఈ మూడు భాషల్లోనూ ఈ నెల 14న అత్యధిక ధీయోటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశాము. అయితే తమిళ్ వెర్షన్లొ సెన్సార్ కార్యక్రమాలలో జాప్యం వలన ఈ మూడు భాషల్లోను ‘మాలిని అండ్‌ కో’సినిమా విడుదలను వాయిదా వేస్తూన్నాము. త్వరలొనే విడుదల తెదిని ప్రకటిస్తాము. ఉత్తర భారతదేశంలో కూడా హిందీ, భోజ్‌పూరి, మరాఠి, గుజరాతీ, బెంగాల్, మరియు ఒరియ భాషల్లొ కూడా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాము. ఒక చిన్న సినిమాగ మొదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 9భాషల్లో రిలీజ్ చేస్తున్నందుకు మాకు చాల సంతోషంగా ఉంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని ఆశిస్తున్నాము అని అన్నారు.
చిత్ర దర్శకుడు వీరు.కె. మాట్లాడుతూ: ‘మాలిని అండ్‌ కో’సినిమా తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్‌ మరియు రొమాంటిక్‌ జోనర్‌లో సాగుతుంది. సినిమా బాగా వచ్చింది. ఆర్టిస్టులు, టేక్నీషియన్స్ అందరూ బాగా సహకరించారు. కధకనుగుణంగా పాటలుంటాయి. ఇటివల విడుదలైన పాటలకు, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి భారి ఎత్తున రిలీజ్ అయ్యే ఈ చిత్రం విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాము అని అన్నారు.

పూనమ్‌పాండే, మిన్‌, సామ్రాట్‌, సుమన్‌, జాకీర్‌, రవి కాలే, జీవా, ఖుషీ, ఫరా, కావ్య, సాంబ, చిత్రం బాష తారాగణంగా నటించారు.

ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, డ్యాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, తార, వినయ్‌, ఫైట్స్‌: విజయ్‌, సహ నిర్మాత: రవి హార్‌ కూట్‌, నిర్మాత: మహేష్‌ రాఠి, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved