pizza
త్వరలో 'మన కుర్రాళ్ళే'
You are at idlebrain.com > news today >
Follow Us

03 December 2014
Hyderabad

ఈ డిసెంబర్ 5న విడుదలకు సన్నాహమైన "మన కుర్రాళ్ళే" చిత్రం అనుకున్న విధంగా థియేటర్ల సౌలభ్యం లేకపోవడం వల్ల వాయిదా వేస్తున్నట్టు దర్శక నిర్మాత వీరశంకర్ తెలియజేసారు.ఈ నెలలోనే థియేటర్లు లభించగానే విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.. యువతని అలరించి ఉత్తేజితుల్ని చేసే ఈ చిత్రంలో భారతీయ సినీ చరిత్రలోనే ఎనిమిదిమంది సంగీత దర్శకులు పనిచేయడం మొదటిసారని ఆయన తెలియజేసారు. అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్,రావు రమేష్,శ్రీనివాసరెడ్డి,ఎం.ఎస్.నారాయణ,కృష్ణుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే అందరిని అలరిస్తున్నాయి. ఆస్రా నిర్మాణ్ ఇండియా సమర్పణలో,వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రచన మల్హోత్రా, రాజ్ కళ్యాణ్, శ్రుతి రాజ్, రావు రమేష్, కృష్ణుడు, శ్రీనివాసరెడ్డి,కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, బెంగుళూరు పద్మ, వెంకట్, వేణు మాధవ్ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం కాగా, చాయాగ్రహణం:ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె, శివకాకాని, మోహన్‌జోనా, భీమ్స్ కూర్పు:బస్వా పైడిరెడ్డి, కళ:కె.వి.రమణ,నిర్వహణ:మహేష్ వడ్డి,రాంబాబు కుంపట్ల, సహనిర్మాతలు:గంగ పోలిశెట్టి, సత్యవతి బొరుసు నిర్మాతలు:బి.వి.యస్.శ్రీనివాసు,ఎచ్.ఎస్.అరూన్ కథ,కథనం,మాటలు,దర్శకత్వం:వీరశంకర్.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved