pizza

Sid Sriram's "Manasara Manasara" song is Highlight for Tholubommalata, says Director Viswanath Maganti
సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'మనసారా మనసారా' పాట 'తోలుబొమ్మలాట'కు హైలైట్‌గా నిలుస్తుంది - దర్శకుడు విశ్వనాథ్‌ మాగంటి

You are at idlebrain.com > news today >
Follow Us

24 October, 2019
Hyderabad

'Manasara Manasara' a soulful lyrical sung by Sid Sriram from Tholubommalata is out and wins million hearts already.

Directed by Viswanath Maganti as a complete family entertainer, Tholubommalata stars Dr. Rajendra Prasad, Viswant Duddampudi, Harshitha Chowdary, Vennela Kishore, Devi Prasad, Narra Srinivas and others in the production of Durga Prasad Maganti under Sumadurga Creations.

Pacing up the post production works on high brisk, Tholubommalata is announced to release in november.

While speaking about the song, Sid Sriram says "I feel very happy to lend my vocals to this soulful melody 'Manasara Manasara' written by Chaitanya Prasad and tuned by Suresh Bobbili and directed y Viswanath Maganti. Beautiful lines and soothing music in the song gave me intense feels while singing. Listent to it righaway, I hope you'll love it too."

Director Viswanath Maganti says, "There are 5 songs in the movie and popular singers like Sid Sriram, Vijay Yesudaas, Chinmayi, Anurag Kulakarni, Yazin Nazir, Sameera Bharadwaj, Hemachandra gave their vocals for the lovely lyrics written by Chaitanya Prasad. 'Needi Naadi Oke Katha' & 'Appatlo Okadundevadu' fame Music Director Suresh Bobbili gave superb tunes for all the songs. Also, Sid Sriram's "Manasara Manasara" is going to played in the crucial break-up scene between Viswant and Harshitha in the movie, so it's going to be the major highlight for the movie. Besides everything, I believe Tholubommalata will surely give a turning-point to Viswant & Harshitha's career."

Producer Duragaprasad Maganti adds, "Movie seems like a hide-n-seek game between 3 generations of a family that's twisted with enough drama of myths, mis-understandings, shattered dreams, insults, self-respect and prestige issues. The way a young guy deals with all these intense family emotions is going to thrill and surprise audience at theatres in november."

Cast:
Sangeetha, kalpana, Sireesha Sougandh, Dhanraj, Pooja Ramachandran, Narayana Rao, Chalapati Rao, Prasad Babu, Tagubotu Ramesh, Bus Stop fame Koteswara Rao, Allu Ramesh etc.

Technicians:
Cinematography - Satish Mutyala
Editing - Kotagiri Venkateswara Rao
Art - Mohan. K. Taalluri
Executive Producer - Ramesh Nookavalli

సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'మనసారా మనసారా' పాట 'తోలుబొమ్మలాట'కు హైలైట్‌గా నిలుస్తుంది - దర్శకుడు విశ్వనాథ్‌ మాగంటి

డా. రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, నర్రా, శ్రీనివాస్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'తోలుబొమ్మలాట'. సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్‌ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన 'మనసారా మనసారా' పాటు లిరికల్‌ వీడియోను ఇటీవల విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిద్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ''సురేష్‌ బొబ్బిలి స్వరకల్పనలో చైతన్యప్రసాద్‌ రాసిన 'మనసారా మనసారా' అనే మంచి పాటతో మళ్లీ మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన మెలోడీ, అందమైన సాహిత్యం ఉన్న ఈ పాట నాకు ఉద్వేగంతో కూడిన అనుభూతినిస్తుంది. మీరూ వినండి. మీకూ అదే అనుభవాన్నిస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు విశ్వనాథ్‌ మాగంటి మాట్లాడుతూ ''ఈ చిత్రంతో మొత్తం 5 పాటలున్నాయి. అందరూ ఫేమస్‌ సింగర్స్ పాడారు. సిద్‌ శ్రీరామ్‌, విజయ్‌ ఏసుదాస్‌, చిన్మయి, అనురాగ్‌ కులకర్ణి, యాజిన్‌ నజీర్‌, సమీరా భరద్వాజ్‌, హేమచంద్ర ఈ పాటలు ఆలపించారు. ఈ పాటలన్నీ చైతన్య ప్రసాద్‌ రాశారు. 'నీదీ నాదీ ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి మంచి సినిమాలకు స్వరాలందించిన సురేష్‌ బొబ్బిలి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'మనసారా మనసారా' పాట సినిమాలో చాలా కీలకమైనది. ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. విశ్వంత్‌, హర్షితపై ఈ పాట చిత్రీకరించాం. విశ్వంత్‌, హర్షితకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుంది'' అని తెలిపారు.

నిర్మాత దుర్గాప్రసాద్‌ మాగంటి మాట్లాడుతూ ''ఒక కుటుంబంలోని మూడు జనరేషన్ల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వీటన్నిటి కలబోత ఈ చిత్రం. ఒక చిన్న కుర్రాడు ఇంత ఇంటెన్సిటీ, డెప్త్ ఉన్న ఫ్యామిలీ ఎమోషనల్‌ స్టోరీని ఎలా డీల్‌ చేశాడా అని రేపు సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్‌ ఫీలవుతారు. నవంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.

నటీనటులు:
సంగీత, కల్పన, శిరీష సౌగంద్‌, ధన్‌రాజ్‌, పూజా రామచంద్రన్‌, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, 'తాగుబోతు' రమేష్‌, 'బస్టాప్‌' కోటేశ్వరరావు, అల్లు రమేష్‌ తదితరులు నటించారు.

సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: మోహన్‌.కె.తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ నూకవల్లి.

పల్లవి:
మనసారా మనసారా
మనసులు వేరయ్యే
తడబాటో పొరపాటో
ఎడబాటయ్యేలే
విధి రాయని కథలోనా
విరహం మిగిలేలే
చిరునవ్వే వెళిపోతూ
పలికే వీడ్కోలే
నా ప్రాణమే... నన్నొదిలేసీ వెళిపోయే
ఆవేదనే...తోడయ్యిందిలే
మనమన్నదే...ఓ మతి లేనీ మాటయ్యే
నువ్ - నేనుగా... విడిపోయిందిలే

(Female Humming)
చరణం: 1
He:
ఈ శూన్యమే... ఇక నా నేస్తమై
ఎదలో...కొలువై... ఉంటుంది జంటై
దరహాసమే... ఒక పరిహాసమై
తిరిగా...నేనే... నడిచే వింతై
గురి చూసి కొడితే... తగిలింది బాణం
ఎద లోని గాయం... మానేనా !?
ఈ బాధతో.... నే బతకాలీ కలకాలం
బాధే సుఖం.... అనుకోవాలిలే
నా ప్రాణమే... నన్నొదిలేసీ వెళిపోయే
ఆవేదనే...తోడయ్యిందిలే

చరణం: 2
She:
నా ఊపిరే...పెను సుడిగాలిలా
కసిగా...దూరం...తోసింది నిన్నే
నీ ఊహలే... నను ఊపేయగా
పిచ్చే...పట్టీ...తిరిగా నేనే
నువు రాకు అన్నా... కన్నీరు వినదే
కలలన్ని కరిగీ...కురిసేలే
ఈ శోకమే... నా లోకంగా మారిందీ
నా ఆశనే... మసి చేసిందిలే
నా ప్రాణమే... నన్నొదిలేసీ వెళిపోయే
ఆవేదనే...తోడయ్యిందిలే

Singers: చిన్మయి, సిద్ది శ్రీరామ్
Lyrics: చైతన్య ప్రసాద్
Music: సురేష్ బొబ్బిలి
Director: విశ్వనాథ్ మాగంటి
Producer: దుర్గా ప్రసాద్ మాగంటి

.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved