pizza
Manchu Lakshmi as Yoga Promotor
యోగా ప్రమోటర్ గా మంచు లక్ష్మి
You are at idlebrain.com > news today >
Follow Us

6 June 2018
Hyderabad

మోడ్రన్ లైఫ్ స్టైల్ లో యోగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒత్తిడితో నిండిన జీవన విధానం, బరువు తగ్గించుకోవడం.. వంటి సమస్యలతో పోరాడేందుకు యోగా శక్తి వంతమైన ఆయుధంగా మారింది. అయితే యోగా లన్నీ ఒక్కటే నా ..? అంటే ఖచ్చితంగా కాదు అనుకోవాలి. శాస్త్రీయ మైన యోగా కేంద్రాలు అరుదుగా దొరుకుతాయి. యోగాను తమ జీవితంగా మార్చుకున్న ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా కొంతమందే ఉంటారు. యోగాను పూర్తిగా అర్ధం చేసుకొని దానిని ఫిజికల్ ప్లెక్సిబిలిటీ పెంచే సాధనంగా మాత్రమే కాకుండా మానసికమైన ఒత్తిడులును తగ్గించే మంత్రంగా మార్చడానికి శాస్త్రీయ విధానాలు తెలిసిన వారికే సాధ్యం అవుతుంది. ఆ కోవకు చెందినదే హటమ్ స్టూడియో . ఇషా ఫౌండషన్ నుండి ట్రైనర్ గా సర్టిఫై అయిన ఉషా మూర్తినేని మంచు లక్ష్మి కి యోగా లో శిక్షణ ఇస్తున్నారు. ఉషా మూర్తినేని నిర్వహిస్తున్న హటమ్ స్టూడియో కు మంచు లక్ష్మి అతిథిగా విచ్చేసారు. కొద్దిసేపు తను ఆ స్టూడియో లో యోగా ను ప్రాక్టీస్ చేసి తన అనుభవాలను స్టూడెంట్స్ తో పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ:
‘‘ యోగా తన జీవితంలో భాగం అయినప్పటినుండి తన జీవితం పై పూర్తి నియంత్రణ వచ్చింది. రోజూ ఇన్ని పనులు మేనేజ్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం యోగా మాత్రమే. ఎవరి జీవితంలో కి అయినా యోగాను అనుమతిస్తే వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఉష అక్క యోగాను ప్రాక్టీస్ చేయించడం మొదలు పెట్టినప్పటినుండి యోగా పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఉషా అక్క ఇచ్చిన శిక్షణ లో యోగా అంటే శరీరం మనసు ఒకే ఆలోచనపై నిలవడం అనే విషయం అనుభవం లోకి వచ్చింది. యోగా అంటే అది మన సంస్కృతి, మన పెద్దలు మనకు ఇచ్చిన ఆస్థి. ఇలాంటి యోగా సెంటర్స్ అవసరం సొసైటికి చాలా ఉంది. హటమ్ స్టూడియో చాలా బాగుంది. మంచి సౌకర్యాలతో ఒక యోగా సెంటర్ ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ’’ అన్నారు.

యోగా ట్రైనర్ ఉష మూర్తినేని మాట్లాడుతూ:
‘‘మంచు లక్ష్మి గారు తన బిజీ షెడ్యూల్ లో కూడా యోగాను ప్రాక్టీస్ చేయడం మానరు. అది తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన యోగాను ప్రాక్టీస్ చేసే తీరు చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజు స్టూడియోను కు తను రావడం చాలా ఆనందంగా ఉంది. హటమ్ స్టూడియో లో యోగాను శాస్త్రీయ పద్దతులలో నేర్పించడం జరుగుతుంది. వెయిట్ లాస్ కి ప్రత్యేక శిక్షణ తో పాటు రెగ్యులర్ గా వచ్చే స్టూడెంట్స్ కి ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ’’ అన్నారు.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved