1 November 2015
Hyderabad
రాము అన్నయ్య మా మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది...మంచు మనోజ్
డా.మోహన్ బాబు సోదరుడి తనయుడు మంచు రాము అనారోగ్య కారణంగా అక్టోబర్ 30న పరమపదించారు. రాము మంచు మరణంతో మంచు ఫ్యామిలీ షాక్ కు గురైంది. ఈ జనరేషన్ లో మా ఫ్యామిలీలో ముందు పుట్టిన వ్యక్తి రాము అన్నయ్య. మా అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. జాండీస్ కారణంగా ఆయన 30వ తేదీ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. మేమంతా ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని మంచు మనోజ్ తెలియజేశారు.