pizza
Maruthi birthday (8 October) interview about Mahanubhavudu
`మ‌హానుభావుడు` స‌క్సెస్‌తో ద‌ర్శ‌కుడిగా మ‌రింత బాధ్య‌త పెరిగింది - మారుతి
You are at idlebrain.com > news today >
Follow Us

7 October 2017
Hyderabad

ఇటీవల విడుదలైన 'మహానుభావుడు'తో సక్సెస్‌ అందుకున్న దర్శకుడు మారుతి పుట్టినరోజు అక్టోబర్‌ 8. ఈ సందర్భంగా మారుతి మీడియాతో మాట్లాడారు.

అందరికీ నచ్చింది...
- ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది. నా గత చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్‌లో ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన చిత్రాలుగా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అయితే మహానుభావుడు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక చిన్న సామాజిక బాధ్యత, చిన్న ప్రేమకథ అన్నీ ఎలిమెంట్స్‌ ఇందులో కలిసి ఉన్నాయి. ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సినిమాగా ఇది నిలిచిపోయింది. ప్రేక్షకులకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్‌ ఇందులో ఉంది. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టెషన్స్‌ను ఇక్కడి నుండి ఇలాగే మెయిన్‌టెయిన్‌ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను.

సెటిల్డ్‌ సినిమాలే చేస్తా...
- మారుతి సినిమా అంటే కొత్త కథను ఎంటర్‌టైన్‌మెంట్‌ మిక్స్‌ చేసి చూపిస్తాడని నమ్మొచ్చు. ఇకపై కూడా సెటిల్డ్‌గా సినిమాలు చేయాలనుకుంటున్నాను. నేను ప్రత్యేకంగా మెసేజ్‌ ఇవ్వాలనే సినిమాలు చేయను.

టైలర్‌లాంటోడ్ని...
- డైరెక్టర్‌ అనేవాడు టైలర్‌లాంటోడు. ఎలాగంటే ఎవరైనా బట్టలు కుట్టమని టైలర్‌ దగ్గరకు వస్తే, వారికి సరిపోయేలా కుట్టిస్తాడు. అలా..నేను ఓ హీరోను అనుకుని అతనికి తగ్గట్లు కథను తయారుచేస్తాను. చైతుతో ఎప్పటి నుండో ఓ సినిమా చేద్దామని ట్రావెల్‌ అవుతున్నాను. ఎలాంటి కథ తన బాడీ లాంగ్వేజ్‌కు సూట్‌ అవుతుందో ఆలోచించి కథను రాసుకున్నాను. చైతుతో పోస్ట్‌ మ్యారేజ్‌ అంశాలతో సినిమా చేస్తున్నానని, చైతన్య డిజార్డర్‌ ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. ఆ వార్తల్లో నిజం లేదు. ఓ యంగ్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీని చైతుతో తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం నేను ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉన్నాను. నవంబర్‌లో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది.

ఆడియెన్‌లా ఫీల్‌ అవుతా....
- ఆడియెన్‌లా సినిమాను ఫీల్‌ అయినప్పుడే దాన్ని తెరపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఐడియా రాగానే నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు చెబుతా, వాళ్లు ఎగ్జయిట్‌ అయితే దాన్ని మరో వంద మందికి చెబుతా, అలా నా ఆలోచనను కార్యాచరణలోకి పెడతాను.

interview gallery

అందరితో సినిమాలు చేయాలి...
- నాకు కొత్త, పాత అనేం లేదు. అలాగే పెద్ద హీరో, చిన్న హీరోలని కూడా తేడా లేదు. అందరితో పనిచేయాలనే అనుకుంటున్నాను.

ఆ ఆలోచనలు లేవు...
-సీక్వెల్స్‌, రీమేక్‌లు చేయాలని కానీ అనుకోను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved