pizza
Master Teja debut film details
తేజ‌ హీరోగా హరి దర్శకత్వంలో బెక్కెం గోపి చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

20 August 2017
Hyderabad

`చూడాల‌ని ఉంది`, `ఇంద్ర‌`, `యువ‌రాజు`తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో బాల‌న‌టుడిగా తెర‌పై క‌నువిందు చేసిన ఘ‌న‌త మాస్ట‌ర్ తేజ సొంతం. మాస్ట‌ర్ తేజ ఇప్పుడు తేజ‌గా మారి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి సంస్థ‌లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు ప‌నిచేసిన హ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ `` క‌థ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో జ‌రిగే యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. కుటుంబ‌స‌మేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. `ఉయ్యాల జంపాల‌`, `స్వామిరారా` చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చిన సంగీత ద‌ర్శ‌కుడు స‌న్నీ ఎం.ఆర్‌. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అని అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved