pizza
Romantic number "Guche Gulabi" from Akhil Akkineni's "Most Eligible Bachelor" is out now
అరె గుచ్చే గులాబిలాగా నా గుండె లోతునే తాకినిదే వెలుగిచ్చే మ‌తాబిలాగా నా రెండు క‌ళ్ళ‌లో నిండిన‌దే అంటూ విభ కొసం పాడుతున్న అఖిల్ అక్కినేని
You are at idlebrain.com > news today >
 
Follow Us

13 February -2021
Hyderabad
Akhil Akkineni and Pooja Hegde starrer Most Eligible Bachelor is gearing up for its theatrical release. The film is slated for release on 19th June. Today, the second single from the audio album 'Guche Gulabi' was released by the makers. Gopi Sunder and Armaan Malik have weaved magic with Guche Gulabi. The song is a groovy number and Akhil who plays a shrewd bachelor in the film reveals the way in which he fell in love with Vibha aka Pooja Hegde. Most Eligible Bachelor is directed by Bommarillu Bhaskar and produced by Bunny Vas and Vasu Varma under GA2 Pictures banner.

‌అరె గుచ్చే గులాబిలాగా నా గుండె లోతునే తాకినిదే. వెలుగిచ్చే మ‌తాబిలాగా నా రెండు క‌ళ్ళ‌లో నిండిన‌దే..ఎవ‌రే నువ్వే ఏంచేసినావే.. ఎటుగా న‌న్నే లాగేసినావే..,చిటికేవేసే క్ష‌ణం లో న‌న్నే చ‌దివేస్తున్నావే.. ఎదురై వచ్చి ఆపేసినువ్వే ఎద‌రేముందో దాచేసినావే..రెప్ప‌ల దుప్ప‌టిలొప‌ల గుప్పెడు ఊహ‌లు నింపావే.. అంటూ విభ మీద త‌న ఫీలింగ్ ని పాట రూపంలో పాడుతున్న అఖిల్ అక్కినేని. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నుండి సెకండ్‌ సింగిల్ గా గుచ్చే గులాబి సాంగ్ ని వెలెంటైన్స్ డే సంద‌ర్బంగా విడుద‌ల‌ చేశారు. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ గా అఖిల్ అక్కినేని ని చూసేందుకు అభిమానుల్లో రోజు రొజు కి ఆసక్తి పెరుగుతుంది. వారి అంచ‌నాలు మ‌రో రెండింత‌లు పెరిగేలా గుచ్చే గులాబి సాంగ్ వుండ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప‌బ్లిసిటి మెటెరియ‌ల్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్సాన్స్ రావ‌టం చిత్ర యూనిట్ మ‌రింత ఉత్సాహంగా వున్నారు. అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్రేమికుల రోజు కానుకా సెన్సేష‌న్ మ్యూజిక్ డైరక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన గుచ్చే గులాబీలాగా సాంగ్ కి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ని అర్మ‌న్ మాలిక్ పాడారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చిత్రాల్లో ఆడియో ఎప్పుడు పెద్ద ఎసెట్ కావ‌టం, అలాగే జి ఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో చిత్రాల‌కి మ్యూజిక్ పెద్ద ఎసెట్ కావ‌టం విశేషం. ఇప్ప‌డు వీరిద్ద‌రి కాంబినేష‌న్ సాంగ్స్ వ‌స్తున్న ఈ సాంగ్స్ కి చిత్రం లో అంచ‌నాలు మించేలా వుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved