pizza
Meghana Lokesh about Idi Maa Prema Katha
సీరియ‌ల్స్‌, సినిమాలు..రెండింటిని ఎంజాయ్ చేస్తున్నాను - మేఘ‌నా లోకేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 December 2017
Hyderabad

యాంక‌ర్ ర‌వి, మేఘ‌నా లోకేష్ జంట‌గా న‌టించిన చిత్రం `ఇది మా ప్రేమ‌క‌థ‌`. మ‌త్స్య క్రియేష‌న్స్‌, పిఎల్‌కె ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయోధ్య కార్తీక్ ద‌ర్శ‌కుడు.

ఈ సినిమా గురించి మేఘ‌నా లోకేష్ మాట్లాడుతూ -``నా తొలి చిత్రం. బేసిక్‌గా నాకు యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్ సినిమాలంటే కాబ‌ట్టి ఇది మా ప్రేమ‌క‌థ అనే ల‌వ్‌స్టోరీ చెప్ప‌గానే ముందు ఎందుకు చేయాల‌నిపించింది?. అయితే దర్శ‌కుడు కార్తీక్‌గారు నన్ను క‌న్విన్స్ చేశారు. మా టీవీలో అన్న‌పూర్ణ స్టూడియోస్‌వారు నిర్మించే శ‌శిరేఖా ప‌రిణ‌యం సీరియ‌ల్ చేసేదాన్ని. ఆ సీరియ‌ల్ పూర్తైన త‌ర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాను. ఇప్పుడు జీ తెలుగులో క‌ల్యాణ వైభోగం సీరియ‌ల్ చేస్తున్నాను. జీ తెలుగు టీం కూడా డేట్స్ అడ్జ‌స్ట్ చేసి ఈ సినిమా పూర్తి కావ‌డానికి బాగా స‌పోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చిన్న బ‌డ్జెట్‌లో సినిమాను ఇంత బాగా చేయ‌వ‌చ్చా ? అనిపించింది. నేను క‌న్న‌డ అమ్మాయిని. ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఎనిమిదేళ్ల నుండి థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా వ‌ర్క్ చేశాను. డిగ్రీ చ‌దివే వ‌ర‌కు 275 స్టేజ్ షోస్ ఇచ్చాను. తెలుగులో హీరో నాగార్జున‌గారు, హీరోయిన్స్‌లో సౌంద‌ర్య‌గారంటే చాలా ఇష్టం. అస‌లు నేను ముందు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించాల‌ని అనుకోలేదు. అయితే అవ‌కాశం మాత్రం వెతుక్కుంటూ వ‌చ్చింది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే..ఇదొక ల‌వ్ స్టోరీ. ఇద్ద‌రు ప్రేమికులు ఎందుకు విడిపోతారు? అస‌లు ప్రేమించ‌డానికి క‌రెక్ట్ వ‌య‌సేంటి? అస‌లు ప్రేమికులు ఎందుకు విడిపోతారు? ఓ స‌మ‌స్య‌ను అబ్బాయి ఒక‌లా ఆలోచిస్తే, అమ్మాయి ఒక‌లా ఆలోచిస్తుంది. అలాంటిది ఇద్ద‌రు ఒకేలా ఆలోచిస్తే స‌మ‌స్య ఉండ‌దు క‌దా! అనేదే స‌మ‌స్య‌. ఇందులో నా పాత్ర పేరు సంధ్య‌, తుల‌సీగారు, వైజాగ్ ప్ర‌సాద్‌గారు నా త‌ల్లిదండ్రులుగా న‌టించారు. సీరియ‌ల్స్‌, సినిమాలు..రెండిటిలో న‌టించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంత‌కు ముందు క‌న్న‌డలో కూడా సినిమాలు చేయ‌మ‌ని న‌న్ను అడిగారు. అయితే డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల క‌న్నడ సినిమా చేయ‌లేపోయ‌ను. సినిమా ఫ‌స్ట్ కాపీ చూశాను. డీసెంట్‌గా అనిపించింది`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved