pizza
MM Jyothi Krishna about Oxygen
ఆక్సిజ‌న్‌..మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమా - ఎ.ఎం.జోతికృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 November 2017
Hyderabad

గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆక్సిజన్‌'. గోపీచంద్‌ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మించారు. సినిమా న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ ``సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమా పూర్తై ఎనిమిది నెల‌ల‌వుతుంది. కానీ గ్రాఫిక్స్ వ‌ర్క్ కార‌ణంగా సినిమా ఆల‌స్య‌మైంది. ఈ గ్యాప్‌లో సినిమాను బాగా రీ ఎడిట్ చేసుకుంటూ వ‌చ్చాను. ఈ సినిమా స్టార్ట్ చేసేట‌ప్పుడు సీజీ వ‌ర్క్‌ను పెద్ద‌గా లేకుండా ఉండాల‌నుకున్నాను కానీ, కంటెంట్ ప్ర‌కారం చూస్తే సీజీ వ‌ర్క్ అవ‌స‌రమైంది. సినిమా చూసిన ప్ర‌తి పౌరుడికి దేశం కోసం ఏదైనా చేయాల‌నిపిస్తుంది. నా మొద‌టి సినిమా త‌ర్వాత చాలా ప్ర‌య‌త్నాలు చేశాను కానీ, అవ‌కశాలు రాలేదు. అయితే మా ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఫుల్ బిజీగా మారిపోయాను. మ‌ళ్లీ డైరెక్ష‌న్ చేయాల‌నుకున్నాను. `ఆక్సిజ‌న్ మంచి మెసేజ్ ఓరియెంటెబ‌డ్ మూవీ. దీనికి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ యాడ్ చేశాను. సినిమాలో మూడు స‌స్పెన్స్‌, థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని ముందుగా ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. గోపీచంద్‌గారు సినిమాలో మూడు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేశారు. గోపీచంద్‌గారిని క‌లిసిన‌ప్పుడు ఓ పోలీస్‌క‌థ‌తోపాటు, `ఆక్సిజ‌న్` క‌థ‌ను కూడా చెప్పాను. ఆయ‌న `ఆక్సిజ‌న్` క‌థ‌తోనే సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. ఈ సినిమా క‌థ గోపీచంద్‌గారికి త‌ప్ప‌, మరొక‌రికి న‌చ్చ‌దు. సాధార‌ణంగా నాన్న‌గారు నా క‌థ‌ల్లో మార్పులు చేర్పులు చెబుతుంటారు. కానీ తొలిసారి ఈ క‌థ‌కు ఎలాంటి మార్పు లేకుండా అంగీక‌రించారు. యువ‌న్‌కు తెలుగులో సినిమాలు చేయాల‌ని చాలా ఇష్టం. త‌ను త‌మిళంలో చేసిన సినిమాల‌న్నీ ఇక్క‌డ అనువాద‌మై మంచి విజ‌యాన్ని సాధించాయి. దాంతో ఎలాగైనా మ‌రో మ్యూజిక‌ల్ హిట్ సాధించాల‌ని చాలా క‌సితో మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు చిన్నాగారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా హిట్ అయితేనే నా త‌దుప‌రి చిత్రం గురించి ఆలోచిస్తాను`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved