pizza
Naa Peru Surya - Naa Illu India action scenes in Ramoji Film City
రామెజి ఫిల్మ్‌సిటి లో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో స్టైలిష్ స్టార్ “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”
You are at idlebrain.com > news today >
Follow Us

26 August 2017
Hyderabad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” చిత్ర షూటింగ్ రామెజిఫిల్మ్ సిటి లో ప్ర‌ముఖ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ రామ్ - ల‌క్ష‌ణ్ ల సార‌ద్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ప్ర‌స్తుతం రామెజి ఫిల్మ్ సిటిలో జ‌రుగుతుంది. ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్స్ రామ్- ల‌క్ష‌ణ్ లు ఆద్వ‌ర్యంలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రిస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved