pizza
Nakshatram gets U/A certificate, film release on 4 August
'నక్షత్రం' సెన్సార్ పూర్తి, ఆగస్టు 4 న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

22 July 2017
Hyderabad

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

'నక్షత్రం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందటంతో పాటు సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకుంది అని చిత్ర నిర్మాతలు కె.శ్రీనివాసులు,వేణుగోపాల్ తెలిపారు. ఆగస్టు 4 న విడుదల అవుతుందీ చిత్రం అన్నారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రం తమ బ్యానర్ కు ఇటు చిత్ర పరిశ్రమలోనూ, వ్యాపార వర్గాలలోనూ అటు ప్రేక్షక వర్గాలలోనూ చక్కని గుర్తింపును తెస్తుందని తెలిపారు.

హనుమంతుడి లక్షణాలన్నీ కూడా పోలీసులో కనిపిస్తాయి. మనుషులకంటే భిన్నంగా కనిపిస్తాడు... హనుమంతుడిలాగే సేవాభావం, శక్తియుక్తులు కూడా పోలీసులో కనిపిస్తాయి.అదొక్కటే కాదు... అసలు మన రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? తప్పు చేస్తే భయపడాలి తప్ప వూరికే ఎందుకు భయపడాలి? అనే విషయాల్ని ఇందులో చర్చించాం అని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.అసలు మామూలు పోలీసు ఎలా ఉంటాడు? వాళ్లతో మనం ఎలా ఉండాలనే ఆలోచన దగ్గరే ఈ కథ మొదలైంది. పోలీసు కంటే ముందు, వాళ్లని మనం చూసే కోణం మారాలని చెప్పా ఈ చిత్రంలో.ఎన్ని విమర్శలొచ్చినా, ఏ సమస్యనైనా చివరికి పోలీసే పరిష్కరిస్తాడు. ఆ విషయాన్ని చెబుతూనే, ఓ అంతర్జాతీయ సమస్యని ఇందులో స్పృశించాం అని చెప్పారు దర్శకుడు కృష్ణవంశీ.

సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్య జైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనీష్, ముఖ్తర్ ఖాన్, సాయికిరణ్, ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్, స్వామి; పోరాటాలు: జాషువా మాస్టర్, జాలి బాస్టియన్, శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్

నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు
కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved