pizza
Nandu Mallela about Rendu Rellu Aaru
ముప్పై రూపాయలతో 'రెండు రెళ్ళు ఆరు' సినిమా ప్రారంభమైంది - నందు మల్లెల
You are at idlebrain.com > news today >
Follow Us

5 July 2017
Hyderabad

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్‌పై అనిల్‌ మల్లెల, మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'. నందు మల్లెల దర్శకుడు. ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అందె నిర్మాతలు. ఈ సినిమా జూలై 8న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నందు మల్లెలతో ఇంటర్వ్యూ విశేషాలు...

Dilip Kumar interview gallery

నందు మల్లెల మాట్లాడుతూ - ''నా పూర్తి పేరు నాగేంద్రబాబు కానీ నన్ను అందరూ నందు అని పిలుస్తుంటారు. నాకు జంధ్యాలగారి రచలన్నా, పింగళి నాగేంద్రరావుగారి దర్శకత్వమన్నా చాలా ఇష్టం. జంధ్యాలగారి సినిమా పేరుని నా సినిమా టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా ఉంది. ఇక మా 'రెండు రెళ్ళు ఆరు' సినిమా విషయానికి వస్తే..ఇద్దరు తీసుకునే నిర్ణయం ఆరుగురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథ కాబట్టి 'రెండు రెళ్ళు ఆరు' అనే టైటిల్‌ను పెట్టాం. మా ఊరి పక్కనుండే ఓ కుటుంబంలో ఒక అడపిల్ల, ముగ్గురు మగపిల్లలుండేవారు. ఆ ముగ్గురు మగ పిల్లలు 33 వయసు వచ్చాక చనిపోయారు. సమస్యేంటో ఎవరికీ అర్థం కాలేదు. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. ఆ ఘటన నుండే ఈ 'రెండు రెళ్ళు ఆరు' కథ పుట్టింది.

గీతాంజలి సినిమాకు, మా సినిమాకు చాలా తేడా ఉంది. నాగార్జునగారి 'గీతాంజలి' ఓ ప్రేమకథ, హీరో హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రన్‌ అవుతుంటుంది. కానీ మా సినిమా ఎమోషన్‌ ఫ్యామిలీ స్టోరీ హీరో హీరోయిన్‌ తండ్రుల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా రన్‌ అవుతుంటుంది. కంప్లీట్‌ కామెడి, సెంటిమెంట్‌ ఆధారంగా సన్నివేశాలను డిజైన్‌ చేసుకున్నాను. క్యారెక్టర్స్‌లో కొత్తదనం ఉండాలని విలన్‌గా నటించిన రవి కాలేగారితో తండ్రి పాత్ర చేయించాను. అలాగే దాదాపు ప్రతి సినిమాలో తాగుబోతు పాత్రలో కనపడే తాగుబోతు రమేష్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనపడేలా చూసుకున్నాం. సినిమా ముప్పై రూపాయలతో సితార హోటల్‌లో ప్రారంభమైంది. కథ విన్న నిర్మాతగారు అడ్వాన్స్‌ ఎంత కావాలి అని అన్నారు. అవకాశం రావడమే ఎక్కువ అని అనుకుంటున్న సమయంలో అడ్వాన్స్‌ అంటున్నారే అని మీ ఇష్టం సార్‌..అన్నాను. ఆయన మూడు టీలకు డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. నాకు ఏం అర్థం కాలేదు. మరుసటి రోజు సినిమా కోసం ఆఫీస్‌ తీసుకో అని ఫోన్‌ చేశారు., ఓ నమ్మకం ఏర్పడింది. నేను నిర్మాతగారిని అంతలా నమ్మడానికి కారణమేమంటే..ఆయన రెండు సంవత్సరాలుగా కథలు వింటున్నారు. మంచి కథలు కోసం ఎదురుచూస్తున్నారు. నా కథ నచ్చింది కాబట్టే సినిమా చేయడానికి ముందుకు వచ్చారనిపించింది. సినిమా పూర్తి కాగానే చిన్న సినిమా సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో సాయి కొర్రపాటిగారిని కలిశాం. ఆయన్ను సినిమా చూడమని ఓ వ్యక్తి రెఫర్‌ చేశాడు. ఆయన సరేనని సినిమా చూడటం ప్రారంభించారు. సినిమా స్టార్ట్‌ అయిన పది నిమిషాలకే ఈ సినిమాను నేను తీసుకుంటున్నానని తెలిపారు. ఓ దర్శకుడిగా నాకు ఈ సినిమా బడ్జెట్‌ ఎంతయ్యిందో నాకు తెలియదు. కానీ ఇది నిజం..నేను నాకు, నా టీంకు ఏ రెమ్యునరేషన్స్‌ అడగలేదు. కానీ నా సినిమాకు ఏది అవసరమో దాన్ని సమకూర్చమని కోరాను. వారలాగే చేశారు. ఈ సినిమాలో హీరో నా బ్రదర్‌ అయినా, హీరోను నేను సెలక్ట్‌ చేయలేదు. నిర్మాతగారే సెలక్ట్‌ చేశారు. సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ స్టార్ట్‌ అయిన పది రోజుల తర్వాత నిర్మాతగారుహీరో అనిల్ నా తమ్ముడని నిర్మాతగారికి కూడా తెలిసింది. నా సినిమాలో క్యారెక్టర్స్‌ కనపడాలని అనుకున్నాను కాబట్టే కొత్తవారితో సినిమా చేశాను. నెక్స్‌ట్‌ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను'' అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved