pizza
Nannaku Prematho release on 13 January 2016
సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎన్టీఆర్‌-సుకుమార్‌-బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ల 'నాన్నకు ప్రేమతో..'
You are at idlebrain.com > news today >
Follow Us

09 December 2015
Hyderabad

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతోంది. డిసెంబర్‌ 15 వరకు స్పెయిన్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. దీంతో ఒక్క పాట మినహా టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. స్పెయిన్‌ షెడ్యూల్‌ చాలా బాగా జరుగుతోంది. 60 రోజులపాటు లండన్‌లో చేసిన షెడ్యూల్‌ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా జరిగింది. లండన్‌, స్పెయిన్‌లలో చాలా రేర్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించిన సీన్స్‌, పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. డిసెంబర్‌ చివరి వారంలో ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved