pizza
Nara Rohit - Sri Keerthi films production No.2 movie talkie completed
You are at idlebrain.com > news today >
Follow Us

10 October 2015
Hyderabad

శ్రీ కీర్తి ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ నె0.2 టాకీ పూర్తి

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే టాకీ పార్టు పూర్త‌యింది. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved