pizza
Nara Rohith - SD Chakravarthy - EMVE Studios Combo Movie Announcement
నారా రోహిత్ హీరోగా ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వంలో
ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.3
You are at idlebrain.com > news today >
Follow Us

28 January 2018
Hyderabad

Nara Rohith is continuing to show his versatality. He will be starring in Production No. 3 of EMVE Studios to be made in a typical village backdrop with an experimental subject. Regular shooting of this new untitled film will begin from March. To be directed by SD Chakravarthy and presented by Vaddevalli Satyanarayana, this film marks a newer presentation of Rohith in an unseen getup in rustic backdrop. Currently busy with release of Howrah Bridge, producers roped Sai Kartheek for composing the music while story and screenplay is written by SD Chakravarthy. More details on cast and crew will be announced shortly.

నారా రోహిత్ హీరోగా ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వంలో
ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.3

రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన కథ-కథనాలను ఎంచుకుంటూ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొన్న నారా రోహిత్ తాజాగా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థలో సినిమా సైన్ చేశాడు. ప్రొడక్షన్ నెం.3గా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.డి.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలవ్వనుంది. వడ్డేవల్లి సత్యనారాయణ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో నారా రోహిత్ క్యారెక్టరైజేషన్, గెటప్ చాలా టిపికల్ గా ఉండబోతున్నాయి.

ప్రస్తుతం తమ ప్రొడక్షన్ లో రూపొందిన "హౌరా బ్రిడ్జ్" విడుదలలో బిజీగా ఉన్న నిర్మాణ బృందం.. సినిమా రిలీజవ్వగానే నారా రోహిత్ సినిమాకి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: వడ్డేవల్లి సత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.డి.చక్రవర్తి. నిర్మాణం: ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved