pizza
Nara Rohith starts dubbing for Aatagallu
ఆటగాళ్ళకి డబ్బింగ్ మొదలెట్టిన నారా రోహిత్ !!
You are at idlebrain.com > news today >
Follow Us

4 April 2018
Hyderabad

Sensible hero Nara Rohith and Stylish actor Jagapathi Babu starrer intelligent thriller 'Aatagallu' is gearing up for release. Shooting has been wrapped up and post-production works are on full swing. Darshana Banik is pairing Rohith in this film directed by Paruchuri Murali and produced by Ravindra, Vaasireddy Sivaji, Makkina Ramu and Vaddapudi Jitendra under the banner, Friends Movie Creations. Nara Rohith has started dubbing for the film from today.

Speaking on the occasion, Producers said, "The film's output has been more than satisfactory. Dubbing work has been kick-started today with hero Nara Rohith dubbing for his role. Director Murali has shaped 'Aatagallu' into a intriguing thriller that will keep audience glued. Crazy combination of Nara Rohith - Jagapathi Babu will be a highlight. We are looking release first look and trailer shortly. The film will be released as Summer special.

"Crew:
Dialogues: Gopi
Camera: Vijay C. Kumar
Music: Sai Kartheek
Editor: Martand K. Venkatesh
Art: RK Reddy, PRO: Vamsi Sekhar
Executive Producer: M. Seetharam Raju
Producers: Ravindra, Vaasireddy Sivaji, Makkina Ramu and Vaddapudi Jitendra
Screenplay & Direction: Paruchuri Murali

ఆటగాళ్ళకి డబ్బింగ్ మొదలెట్టిన నారా రోహిత్ !!

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన ఇంటిలిజెంట్ థ్రిల్లర్ "ఆటగాళ్లు". పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారా రోహిత్ సరసన హీరోయిన్ గా దర్శనా బానిక్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ చిత్ర కథానాయకుడు నారా రోహిత్ ఈ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ.. "మేం ఊహించినదానికంటే అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. మా హీరో నారా రోహిత్ ఇవాళ డబ్బింగ్ ఆరంభించారు. దర్శకుడు మురళి "ఆటగాళ్లు" చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved