pizza
SHAH RUKH KHAN FAMOUS FILM STAR SINCE 25 YEARS IS DECLARED FOR 4TH YASH CHOPRA NATIONAL MEMORIAL AWARD
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు 'యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు
You are at idlebrain.com > news today >
Follow Us

30 December 2016
Hyderaba
d

Dr.T.Subbarami Reddy founder of TSR foundation has informed that a jury consisting of TSR ,Pamela Chopra,(wife of late Yash Chopra), Padmini Kolhapure, Boney Kapoor, have decided to give 4th Yash Chopra National Memorial award this time to Shah Rukh Khan.

After the demise of Yash Chopra to perpetuate his Memory Dr.T.Subbarami Reddy through his foundation has instituted a award carrying 10 lakhs gold medal and citation.

Previous award winners are Lata Mangeshkar, Amitabh Bachchan, Rekha for the three years.

This award will be given to Shah Rukh Khan on 25th February,2017 at JW Marriott in Mumbai is a glittering function.

Amitabh Bachchan, Rekha, Sridevi, Rani Mukerji, Aishwarya Rai, Jayaprada, Salman Khan, Aamir Khan and number of other film stars will be participating in the function.

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు 'యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు 'యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు ను ఇవ్వ నున్నట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు డా. టి. సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటన లో పేర్కొన్నారు. పమేలా చోప్రా (దివంగత యశ్ చోప్రా సతీమణి), పద్మిని కొల్హాపురి, బోనీకపూర్ లతో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది యశ్ చోప్రా 4 వ జాతీయ అవార్డు కు గాను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ను ఎంపిక చేసింది.

యశ్ చోప్రా మరణం తరువాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డు ను డా. టి. సుబ్బరామిరెడ్డి 'టి.ఎస్.ఆర్. ఫౌండేషన్' పేరు పై ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతాకం, ప్రసంశా పత్రం ను అవార్డు గ్రహీత కు అందించ నున్నారు. 2017 ఫిబ్రవరి 25 న ముంబై లోని హోటల్ మారియట్ లో జరిజరిగే వేడుకలో ఈ యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డు ను సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు అందించ నున్నట్లు డా. టి. సుబ్బరామి రెడ్డి తెలిపారు.

గతం లో ఈ అవార్డు ను సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని లత మంగేష్కర్, నటులు అమితాబ్ బచ్చన్, రేఖ లు అందుకున్నారు.

అమితాబ్ బచ్చన్, రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు ఇతర సినీ నటులు ఈ అవార్డు వేడుకలో పాల్గొన నున్నారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved