pizza
NATS awareness on Covid19
కరోనా పై అవగాహాన పెంచుతున్న నాట్స్ వరుస వెబినార్స్‌తో తెలుగువారు అప్రమత్తం
You are at idlebrain.com > news today >
Follow Us

13 April 2020
Hyderabad



కరోనా పై అవగాహాన పెంచుతున్న నాట్స్

వరుస వెబినార్స్‌తో తెలుగువారు అప్రమత్తం

టెంపా బే: ఫ్లోరిడా: ఏప్రిల్ 12: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారిని ఆ కరోనా మహామ్మారి బారిన పడకుండా చూసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా నియంత్రణలో అప్రమత్తతే కీలకం కావడంతో నాట్స్ దానిపై దృష్టి సారించి కరోనా పై వెబినార్ ద్వారా అవగాహాన సదస్సులు నిర్వహిస్తోంది. తాజాగా నాట్స్ నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పందన లభించింది. వందలాది మంది ఈ వెబినార్‌లో పాలుపంచుకుని నాట్స్ పై అవగాహాన పెంచుకున్నారు. వైద్య రంగంలో నిష్ణాతులైన వారు ఈ వెబినార్‌ ద్వారా అవగాహాన కల్పించారు. అంటువ్యాధుల చికిత్సలో నిపుణులైన డాక్టర్ వెంకట్ మిన్నగంటి, నెఫ్రాలజిస్ట్ మధు కొర్రపాటి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మూర్తి బాడిగ, ఇఆర్ స్పెషలిస్ట్ సుధీర్ అట్లూరి, గైనకాలజిస్ట్ స్నేహ కొండ్రగుంట, న్యూరాలజిస్ట్ తేజానంద్ మూల్పూరు తదితర వైద్య నిపుణులు ఈ వెబినార్‌లో కోవిడ్-19 పై అవగాహాన కల్పించారు. అనేక మంది సందేహాలను ఈ వెబినార్ ద్వారా నివృత్తి చేశారు. సామాజిక దూరం ఎలా పాటించాలి.. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి..? ఒకవేళ కరోనా సోకితే ఎలా వ్యవహారించాలి..? అనే విషయాలపై పూర్తి స్థాయిలో వైద్యుల బృందం అవగాహాన కల్పించింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ టెంపా బే చాప్టర్ అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, టెంపాబే కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు , టెంపా బే సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ అరికట్ల తదితరులు ఈ వెబినార్ నిర్వహాణ కీలకపాత్ర పోషించారు. కరోనా మరణమృదంగం మోగిస్తున్న ఈ తరుణంలో అమెరికాలో తెలుగువారికి ఈ వెబినార్ కొంత మనోధైర్యాన్ని కల్పించేలా సాగింది. కరోనాను అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాంపై దిశా నిర్థేశం చేసింది. ఇంకా నాట్స్ తెలుగువారి కోసం ఈ కష్టసమయంలో అండగా నిలబడేందుకు కృషి చేస్తూనే ఉంటుందని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. ఈ వెబినార్‌కు సహకరించిన నాట్స్ సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ( మీడియా) మురళీ మేడిచర్ల తో పాటు నాట్స్ సభ్యులందరికీ నాట్స్ టెంపా బే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved