|  | 
    
      |  | 
    
      |  NATS helps 400 poor families in Prakasam districtప్రకాశంలో జిల్లాలో 400 పేద కుటుంబాలకు నాట్స్ సాయంఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసిన నాట్స్
 
 | 
    
      |  | 
    
      | You are at idlebrain.com > news today > | 
    
      | 
        
          
            | 
              
                |  | 
                    
                      | 
 03 May  2020Hyderabad
 
 
 మూగచింతల: ప్రకాశం జిల్లా: మే 3: అమెరికాలో తెలుగువారికి అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఇటు తెలుగునాట కూడా కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి మండలం మూగచింతల గ్రామంలో నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఇక్కడ 400 కుటుంబాలకు పైగా పేదలు ఉండటం.. వారు లాక్‌డౌన్ కారణంతో వారు రోజువారీ జీవనానికి ఇబ్బందులు పడటంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉండే వారు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే ఆయన స్పందించి ఇక్కడ 400 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీకి ఆర్థిక సాయం అందించారు. స్థానికంగా ఉండే నాట్స్ ప్రతినిధి బండారు బాబు పేదలకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడికి మూగచింతల గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమను ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని,నాట్స్ కోశాధికారి మదన్ పాములపాటితో పాటు నాట్స్  బోర్డు సభ్యుల సహకారంతో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నాట్స్  కార్యవర్గం కసరత్తు చేస్తోంది.   
 
 |  |  |  |  | 
    
      | Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com.  All rights reserved |