pizza
NATS Community service held in Guntur by NATS & Mannava Turst,
పేద ముస్లింలకు తోఫా ఇచ్చిన నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2020
Hyderabad

 

గుంటూరు నగరంలో 500 పేద ముస్లిం కుటుంబాలకు సాయం

గుంటూరు: మే 24: గుంటూరు నగరంలో కరోనా నియంత్రణకు పెట్టిన లాక్‌డౌన్‌తో పేద ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంజాన్ పండుగ సమయంలో పనులు లేక పండుగ చేసుకోవడం కూడా కష్టమైన తరుణంలో మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ పేద ముస్లింకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. గుంటూరు నగరంలోని కళ్యాణ్ నగర్, మారుతీ నగర్‌లోని సుమారు 500 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్‌ను తోఫాగా అందించాయి. పేద ముస్లింల పరిస్థితిని స్థానిక ముస్లిం పెద్దలు నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన స్పందించి ముస్లింలు పండుగ జరుపుకునేందుకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయం చేశారు. తమను పండుగ ఎలా జరుపుకోవాలా..? అనే ఆందోళనతో ఉన్న తమకు నాట్స్, మోహనకృష్ణ మన్నవ చేసిన సాయం మరువలేనిదని స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానికులైన మస్తాన్ వలి ,బాజీ,స్వరూప్, సాయినాధ్, అంబరీష్, చైతన్య, సీకే రావు, అఖిల్, అనంత్, చిన్న మీరవాలి, సయ్యద్ మాబు, మాలిక్ రఫీ ఫునిషా, తేజ తదితరులు
పాల్గొన్నారు.

 

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved