pizza
రైతుల ఆత్మహత్యల నేపథ్యంతో వస్తున్న ‘నేచురల్‌ స్టార్‌ 9010140101’
You are at idlebrain.com > news today >
Follow Us

25 May 2015
Hyderabad

అన్నం పెట్టే అన్నదాతకై అండగా నడుద్దాం రండి అంటూ... రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో వరుణ్‌ కార్పొరేషన్‌ పతాకంపై పినకాశి మల్లవ్వ, మల్లయ్య సమర్పణలో నాగవరుణ్‌తేజ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేచురల్‌ స్టార్‌ 9010140101’. ఎస్‌.ఎం.ఎస్‌. ఓన్లీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ మొదటివారం నుంచి జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నాగవరుణ్‌తేజ మాట్లాడుతూ... ‘‘కథలో భాగంగా ఆత్మహత్యలకు గురైన రైతుల కుటుంబాలకు భరోసాగా అన్నదాతలూ ఆత్మహత్యలు వద్దు అంటూ 200కి.మీ. పాదయాత్రను కరీంనగర్‌ జిల్లా నుంచి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ వరకు చేస్తాం. రియల్‌ సన్నివేశాలు ఈ చిత్రంలో వుంటాయి. రెండు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. జూన్‌ మొదటివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని జరుగుతుంది. నేచురల్‌ స్టార్‌ (ఎన్‌జిఓ) సహకారంతో ఈ చిత్రం నిర్మించబడుతోంది. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలను ఆత్మహత్యలకు గురైన రైతుల కుటుంబాలకు అందజేస్తాం. సహజత్వం కోసం కొత్తవారిని ప్రోత్సహిస్తున్నాం. ఏ ఉద్యమమైనా ఒక్కడితో మొదలవుతుంది. ఈ ఉద్యమం మనందరం కలిసి చేద్దాం రండి... నేను రైతుబిడ్డను. రైతుల పక్షాన్నే వుంటాను. నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎన్నారైలు ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రపంచమంతా నాతో మాట్లాడాలనే ధృడసంకల్పంతో నా కాంటాక్ట్‌ నెంబర్‌ని రిజిస్టర్‌ చేయించి ఈ సినిమాకి క్యాప్షన్‌గా పెట్టుకున్నాను. తెలుగు సినీ పరిశ్రమలోనే సంచలనాత్మకంగా 365మందిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నాను. త్వరలో వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేసి రైతుల కష్టాలను ప్రపంచానికి తెలియజేసే మరో ప్రయత్నం చేస్తున్నాం.’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, మాటలు: ప్రసాద్‌, పాటలు: మధుకిరణ్‌, ఫైట్స్‌: అవినాష్‌, కెమెరా: బాలకిషన్‌, కో`డైరెక్టర్‌: శ్రీనివాస్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: నాగవరుణ్‌తేజ.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved