pizza

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107 First Hunt (Teaser) Out
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ #NBK107 ఫస్ట్ హంట్ (టీజర్) విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

9 June 2022
Hyderabad

Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s highly anticipated mass action entertainer tentatively titled #NBK107 produced by Tollywood’s leading production house Mythri Movie Makers is progressing with its shoot. The filming is presently taking place in Hyderabad. A day prior to Balakrishna’s birthday, the makers released First Hunt (teaser) today.

What we get to see in the video is Balakrishna’s royalty, his euphoria, glorious dialogue delivery and the massy attitude. The first hunt is fully loaded with the mad fans stuff.

Balakrishna has two characteristics in the movie, going by the teaser. While he is a Good Samaritan for his people, he is a monster for his enemies. Balakrishna oozes swag in the salt and pepper look, wherein his intimidating avatar brings intensity to the character.

Director Gopichand Malineni designed the character so powerfully that he literally showed his fanism on the biggest mass hero. Each and every dialogue in the teaser uttered by Balakrishna will captivate masses.

“Mee GO Governmnet Order… Naa GO God’s Order…”

“Bhayam naa biodata lone ledu raa boshidike… Narakadam modalupedithe ye part edo mee peellalaki kuda theliyadu naa kodakallaraa…” are the powerful dialogues mouthed by Balakrishna.

Rishi Punjabi’s camera work is stupendous as the visuals are top class, wherein S Thaman’s background score uplifts the massiness of Balakrishna’s character. The production design of Mythri Movie Makers is very lavish.

Kannada star Duniya Vijay is venturing into Tollywood with this movie where he is playing the antagonist. Varalaxmi Sarathkumar will be seen in a significant role.

Naveen Yerneni and Y Ravi Shankar are producing the film on massive scale. Acclaimed writer Sai Madhav Burra has provided dialogues, while National Award-Winning Craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram-Lakshman
CEO: Chiranjeevi (Cherry)

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ #NBK107 ఫస్ట్ హంట్ (టీజర్) విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌ టైనర్‌ రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. బాలకృష్ణ పుట్టినరోజుకు ఒక రోజు ముందే ఈ చిత్రం నుండి ఫస్ట్ హంట్ (టీజర్) ని విడుదల చేసారు.

నిమిషం నిడివి గల ఈ ఫస్ట్ హంట్ టీజర్ హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, స్టన్నింగ్ ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో అభిమానులు పండగ చేసుకునేలా వుంది. బాలకృష్ణ మాస్ యాటిట్యూడ్, స్వాగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌.. స్టైలిష్ గా వుంటూనే మాస్ ని అలరించేలా వుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తన అభిమాన హీరో బాలకృష్ణ పాత్రని మునుపటి కంటే పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసినట్లు టీజర్ చూస్తే అర్ధమౌతుంది.

ఫస్ట్ హంట్ లో బాలకృష్ణ వేటాడే సింహంలా కనిపించారు. టీజర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా వున్నాయి.

మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ .. నా జీవో గాడ్స్ ఆర్డర్..

భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే..

నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా ..

ఈ మూడు డైలాగ్స్ మాస్ కి పూనకాలు తెప్పించేలా వున్నాయి. మొత్తానికి ఫస్ట్ హంట్ టీజర్ తో ప్రేక్షకులకు, అభిమానులకు అదిరిపోయే బహుమతి ఇచ్చారు బాలకృష్ణ.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved