pizza
Ningi Chutte Megham Song From Uma Maheswara Ugra Roopasya Released by Popular Anchor Suma
‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ చిత్రంలో ‘నింగి చుట్టే మేఘం ..’ పాటను విడుదల చేసిన ప్రముఖ యాంకర్ సుమ
You are at idlebrain.com > news today >
Follow Us

7 March 2020
Hyderabad

Baahubali changed the face of Telugu cinema and it helped regional cinema grab eyeballs at the international level. Shobu Yarlagadda and Prasad Devineni produced the film which is the pride of Telugu audience. The blockbuster producers are coming up with a content rich movie Uma Maheswara Ugra Roopasya this time.

Directed by Venkatesh Maha of C/o Kancharapalem fame, the film is produced jointly by Shobu Yarlagadda, Prasad Devineni and Vijaya Praveena Paruchuri under Arka Media Works and Mahayana Motion Pictures.

The first song of the film- ‘Ningi Chutte Megham’ composed by National Award winner Bijibal is unveiled by popular anchor Suma. While Vishwa penned the lyrics, the song is crooned by Vijay Yesudas.

The song that goes like,
“Ningi Chutte Megham
Erugada Ee Lokam Guttu
Munulaa Modaladu Nee Meedottu
Kalam Kadalikalatho Jodi Kattu
Tholigaa Thaaraavaasaala Oosulni Veedi
Choosindi O Saari Sagatula Kanikattu…”

The film’s teaser already received exceptional response. Uma Maheswara Ugra Roopasya is remake of Fahadh Faasil starrer Malayalam super hit Maheshinte Prathikaaram. Satya Dev plays the protagonist in the film scheduled for release on April 17th.

Cast: Satya Dev, Naresh, Suhas, Jabardasth Ram Prasad, TNR, Ravindra Vijay, K Raghavan and others.

Technical Crew:

Direction: Venkatesh Maha

Producers: Vijaya Praveena Paruchuri, Shobu Yarlagadda and Prasad Devineni

Executive Producer: Vasant Jurru

Line Producer: Pragnay Konigari

Production Controller: Ramu.R.K.

Cinematography: Appu Prabhakar

Music: Bijibal

Editor: Ravi Teja Girijala

Story: Syam Pushkaran

Costumes: Amrita Bommi

Sound Designer: Nagarjuna Thalapalli

Production Designer: Sushant Sawant

‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ చిత్రంలో ‘నింగి చుట్టే మేఘం ..’ పాటను విడుదల చేసిన ప్రముఖ యాంకర్ సుమ

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`.ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా జాతీయ అవార్డు గ్ర‌హీతలు బిజ్‌బ‌ల్ సంగీతం అందించిన ఈ సినిమాలో తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విశ్వ సాహిత్యాన్ని అందించిన ఈ పాట‌ను విజ‌య్ యేసుదాస్ ఆల‌పించారు. ఈ పాటను ప్రముఖ యాంకర్ సుమ విడుదల చేశారు.

‘‘నింగి చుట్టే మేఘం
ఎరుగ‌ద ఈ లోకం గుట్టు
మునిలా మెద‌ల‌దు నీ మీదొట్టు
కాలం క‌ద‌లిక‌ల‌తో జోడి క‌ట్టు
తొలిగా తారావాసాల ఊసుల్ని వీడి
చూసింది ఓసారి స‌గ‌టుల క‌నిక‌ట్టు ...’’

అంటూ పాట సాగుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వచ్చింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:
స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌, సుహాస్, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, టీఎన్ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హా
నిర్మాత‌లు: విజ‌య్ ప్ర‌వీణ ప‌రుచూరి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వసంత్ జుర్రు
లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌జ్ఞ‌య్ కొనిగ‌రి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: రాము.ఆర్‌.కె
సినిమాటోగ్ర‌ఫీ: అప్పు ప్ర‌భాక‌ర్‌
సంగీతం: బిజిబ‌ల్‌
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌
క‌థ‌: శ‌్యామ్ పుష్క‌ర‌న్‌
కాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మి
సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున త‌ల‌ప‌ల్లి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సుశాంత్ సావంత్‌


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved