pizza
Nivetha Pethuraj about Mental Madhilo
పెద్ద‌లు కుదిర్చి పెళ్లే మంచిది - నివేదా పేతురాజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 November 2017
Hyderabad

``పెళ్ళిచూపులు` త‌ర్వాత డి.సురేష్ బాబు సమ‌ర్ప‌ణ‌లో దర్మపథ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెంటల్ మదిలో’. రాజ్ కందుకూరి నిర్మాత. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్ జంటగా నటించారు. ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ``నేను పుట్టింది తమిళనాడులో..పెరిగింది దుబాయ్‌లో. అమ్మ తమిళియన్ నాన్న తెలుగువారు. ఇప్పటి వరకు తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో నటించాను. రెండు విడుదలయ్యాయి. మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘మెంటల్ మదిలో’ నా తొలి తెలుగు చిత్రం అని అంటుంది హీరోఇయ‌న్ నివేదా పేతురాజ్‌. ‘‘ . సినిమాల్లోకి రాకముందు దుబాయ్ లో కొన్ని కంపెనీలకు మోడలింగ్ చేశాను. 2015 లో దుబాయ్ మిస్ ఇండియాగా సెలెక్ట్ అయ్యాను. ఆ సమయంలో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ గారు చూసిన నాకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా సినీ రంగంలోకి అడుగుపెట్టాను. మెంటల్ మది సినిమాలో ‘స్వేచ్చ’ అనే ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో కనపడతాను. వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర అది. ఈ క్యారెక్టర్ లో ఎక్కువగా నటించలేదు. ఎందుకంటే సహజంగా ఉంది కాబట్టి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. అలాగే నా కోస్టార్ శ్రీవిష్ణు చాలా మంచివాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు. మొదటి నాలుగు రోజులు మాట్లాడుకోకుండా వర్క్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించినా ఆ తరవాత కలిసిపోయాం. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే బెట‌ర్. ఎందుకంటే ప్రేమలో ప్రేమించే వాళ్ళను వెతుక్కోవాలి, వాళ్ళతో డేట్ కు వెళ్ళాలి. అవన్నీ కష్టం.అతనితో వర్క్ చాలా బాగుంది.తమిళంలో సినిమాలు సైన్ చేస్తున్నాను. తెలుగులో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved