pizza

Kiran Abbavaram’s Nenu Meeku Baaga Kavalsina Vaadini in last schedule
చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం,శ్రీధర్ గాదె "నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని" చిత్రం..

You are at idlebrain.com > news today >
Follow Us

13 June 2022
Hyderabad

చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం,శ్రీధర్ గాదె "నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని" చిత్రం..

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తరువాత దర్శకుడు శ్రీధర్ గాదే, రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం లో కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్న ట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీన‌టులు -

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు

టెక్నికల్ టీమ్:

స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌
బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల
ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ .. భ‌ర‌త్ రొంగలి
సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి
సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌
కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్డి మూలే
ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌.. శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved