pizza
Second Schedule Of Raj Tharun - Director Konda Vijaykumar - KK Radhamohan's 'Orey... Bujjigaa' Begins
రెండో షెడ్యూల్‌లో రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ల 'ఒరేయ్‌.. బుజ్జిగా'
You are at idlebrain.com > news today >
Follow Us

12 October, 2019
Hyderabad

Young Hero Raj Tarun starrer Complete Entertainer 'Orey... Bujjiga' Produced by KK Radha Mohan in Sri Sathya Sai Arts banner Presented by Lakshmi Radhamohan in Konda Vijay Kumar's Direction has started its second schedule from October 12th.

Speaking about film's shooting progress Producer KK RadhaMohan said, " The first schedule of our film has been completed and we started the second schedule from today. This schedule will progress in a non-stop manner. This is a cute love story perfectly matching with the energy of Raj Tharun. Konda Vijaykumar garubwho has made a Superhit Sensitive Love story like 'Gunde Jaari Gallantayyinde' is making this film with an another different story. Nandyala Ravi has penned very good dialogues. Vani Viswanath Garu isnplaying a crucial role in this film. Our 'Orey.. Bujjiga' will surely entertain all sections of audience. This film will become another Superhit film for our banner."

Young Hero Raj Tharun and Malavika Nair will be seen as a lead pair while Vani Viswanath, Naresh, Posani Krishna Murali, Anish Kuruvilla, Sapthagiri, Raja Raveendra, Ajay Ghosh, Annapurna, Siri, Jayalakshmi, Soniya Chowdary, Sathya, Madhunandan plays other important roles.

Music: Anup Rubens, Dialogues: Nandyala Ravi, Cinematography: I Andrew, Editing: Praveen Pudi, Dance: Sekhar, Art: T. Rajkumar, Fights: Real Satish, Production-Executive: M Srinivasa Rao ( Gaddam Srinu), Co-Director: Venu Kurapati
Presented by Smt Lakshmi Radhamohan
Produced by KK Radhamohan
Story-Screenplay-Direction: Konda Vijaykumar

రెండో షెడ్యూల్‌లో రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ల 'ఒరేయ్‌.. బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒరేయ్‌.. బుజ్జిగా'. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ''ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా 'ఒరేయ్‌.. బుజ్జిగా' చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved