pizza
Oy Ninne release on 15 September
‘ఓయ్‌.. నిన్నే’ సెప్టెంబర్‌ 15న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

3 September 2017
Hyderabad

భరత్‌ మార్గాని హీరోగా ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘ఓయ్‌.. నిన్నే’. సృష్టి హీరోయిన్‌. సత్య చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘పరశురామ్, చందూ మొండేటి, సుధీర్‌ వర్మ, కృష్ణచైతన్యల వద్ద మా దర్శకుడు సత్య చల్లకోటి దర్శకత్వ శాఖలో పని చేశాడు. అతనికిదే మొదటి చిత్రం అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్‌.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమకథ చిత్రానికి హైలైట్‌. గతంలో మా సంస్థ నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథాచిత్రమిది. భరత్ మార్గాని, సృష్టిలు కొత్తవాళ్లైనా బాగా నటించారు’’ అన్నారు.

దర్శకుడు సత్య చల్లకోటి మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో మాటను ఎదుటివ్యక్తి మొహం మీదే చెప్పేస్తుంటాడు. అతనికది కొన్నిసార్లు ప్లస్‌ అయితే, ఇంకొన్నిసార్లు మైనస్‌ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో అతనికి ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నాకిది మొదటి చిత్రమైనా మా నిర్మాత ఇచ్చిన మద్దతు మరువలేను’’ అన్నారు.

తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేష్, తులసి, ప్రగతి, ధనరాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్, లిరిక్స్‌: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: వెంకట్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved