pizza
Palasa 1978 release by Geetha & UV
గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ద్వారా విడుదల కానున్న ''పలాస 1978'' చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

26 December 2019
Hyderabad

Allu Aravind backed GA2 and UV Creations banners have been producing several medium budget movies for the last couple of years. Very soon, both the banners will be joining forces to release a small film, titled Palasa 1978.

Apparently Allu Aravind ,Bunny Vas & UV Vamsi Impressed with this realistic film and wanted to support it.
Palasa 1978 is being presented by senior filmmaker Thammareddy Bharadwaja. Starring newcomers, the film is directed by debutant Karuna Kumar and produced by Dhyan Atluri. The film is based on some real crime incidents that took place in Srikakulam in late 70s. The film is hitting screens in January end.

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ వరుసలో గీతా ఆర్ట్స్, యువి ప్రొడక్షన్స్ ''పలాస 1978'' చిత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లా పలాస లో జరిగిన యదార్థ సంఘటనలు, కొన్ని యదార్థ పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన ''పలాస 1978'' చిత్రాన్నిGA2-UV సంస్థ ద్వారా విడుదల చేస్తున్నామని సంస్థ తరపున బన్నీ వాసు తెలిపారు.

పలాస చిత్రం అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీ లకు బాగా నచ్చింది. కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని, మంచి సినిమాలను అందరికీ చేరవెయ్యాలని అల్లు అరవింద్ భావించడంతో జనవరి చివరి వారంలో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

రక్షిత్, నక్షత్ర జటగా నటించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, విన్సెంట్ ఫొటోగ్రఫీ, రఘు కుంచె సంగీతం అందించారు. ఇప్పటికే సుకుమార్, మారుతి, పూరీ జగన్నాథ్ వంటి ప్రముఖ డైరక్టర్లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం, గీతా ఆర్ట్స్, యువి వంటి పెద్ద సంస్థలు రిలీజ్ చేస్తుండటం, పలాస 1978 సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved