pizza
Pawan Kalyan tweets about Dangal
You are at idlebrain.com > news today >
Follow Us

2 January 2017
Hyderaba
d

సామాజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లోస్పందిస్తారు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్నిప్రశంసల్లో ముంచెత్తారు. వసూళ్లను అద్భుతంగా రాబడుతూ దేశం లోనే సంచలనం సృష్టిస్తున్న అమీర్ ఖాన్ 'దంగల్' చిత్రం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అమిర్ ఖాన్ ఈ చిత్రంలో అద్భుత నటనని కనబరిచార ని, ఆనటనతోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు .
ఈ చిత్రాన్ని చూసిన తరువాత తాను 'దంగల్' గురించి తన అభిప్రాయాన్ని చెప్పకుండాఉండలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు . ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభినందించారు . ప్రేక్షకులు లీనమయ్యేలా ఈచిత్రాన్ని తెరకెక్కించారని పవన్ కళ్యాణ్ అన్నారు. మిగతా నటీనటులను, సాంకేతిక బృందాని కి కూడా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం మహిళలసాధికారత గురించి మనందరం ఆలోచించేలా చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా తన ట్విట్టర్ లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ రాజకీయ, సామజిక సమస్యల గురించే ట్వీట్ లు చేస్తూంటారు. ఓ సినిమా గురించి ట్వీట్ చేయడంఇదే తొలిసారి. ఈ చిత్రం లో మహిళల సాధికారత గురించి అద్భుతంగా చూపించడంతో చిత్ర బృందాన్నిఅభిందించాలని పవన్ కళ్యాణ్ ఈ చిత్రం పై స్పందించారు .

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved