pizza
Peoples Media announces ₹25 lakhs to Telangana CM fund
You are at idlebrain.com > news today >
Follow Us

28 April 2020
Hyderabad


Mr. TG Vishwa Prasad, chairman of People Tech Group and People Media Factory, met TRS Working president KTR garu this morning in his office and made a donation of Rs. 25 lakhs towards Telangana CM relief fund for the fight against COVID-19.

Mr. Vishwa Prasad expressed his pleasure at the measures implemented by the Telangana government to control the spread of the corona virus and went on to say, ‘All the employees of People Tech and People Media Factory donated one day worth of their salaries. We matched the number and decided to donate it to the Telangana CM COVID-19 relief fund to contribute to their great efforts. I request everyone to stay at home, follow the rules and cooperate with the officials.’ He went on to express his heartfelt thanks to the medical professionals, police department and all the other essential workers for their tireless efforts during this difficult time. Mr. TG Vishwa Prasad was accompanied by Mr. Vivek Kuchibhotla, his co-producer at People Media Factory.

 

*కరోనాపై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల
విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్.

* ఈరోజు ఉదయం టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె.టి.ఆర్. ను సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తో కలసి చెక్ అందించిన నిర్మాత టి.జి. విశ్వప్రసాద్.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్. తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది అంటారాయన. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్. తమ సంస్థలైన 'పీపుల్ టెక్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగుల ఒకరోజు వేతనానికి సమానంగా మరికొంత మొత్తాన్ని జతచేసి, మొత్తంగా రూ.25 లక్షలను ఈరోజు ఉదయం టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె.టి.ఆర్. ను సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తో కలసి చెక్ రూపంలో అందించారు నిర్మాత టి.జి. విశ్వప్రసాద్. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన‌ చేశారు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా మహమ్మారివల్ల భయాందోళనలో ఉంది.
క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌ మరియు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డింది. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అందులో భాగంగా. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండని ఆకాంక్షించారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved