pizza
అక్టోబ‌ర్ 10నవిడుద‌ల‌వుతున్న‌పిచ్చేక్కిస్తా..
You are at idlebrain.com > news today >
Follow Us

04 October 2014
Hyderabad

చిన్న చిత్రాల‌కు ధియోట‌ర్స్ వ‌ర‌కూ ప్రేక్ష‌కుడిని రాబ‌ట్ట‌టానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్న ఈరోజుల్లో టైటిల్ ద‌గ్గ‌ర నుండి అంద‌రిని ఆకట్టుకుంటున్న చిత్రం పిచ్చేక్కిస్తా.. ఈ సినిమా ఆడియో ని ప్ర‌ముఖ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ ఆడియో ఇప్పటికే విజ‌య‌వంతం కాగా ఈసినిమా విడుద‌ల మీద అంచ‌నాలు పెరిగాయి.. ఈ సినిమాని అక్టోబ‌ర్ 10 న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ని మిర్రర్ మీడియా స‌మ‌ర్ప‌ణ లో, 7 ఆర్ట్స్ అండ్ మాన‌స ఫిల్మ్స్ ప‌తాకం పై న‌ట‌రాజ్ కోట్టూరి, శ్రీకాంత్ రెడ్డి, రాజ‌శేఖ‌ర్ లంక లు సంయుక్తం గా నిర్మించారు. ఎన్ ,కె, హ‌రిణి లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ" అంద‌రూ కొత్త న‌టీన‌టుల‌తో ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ రెడ్డి ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ మా బ్యాన‌ర్ 7ఆర్ట్స్అండ్ మాన‌స ఫిల్మ్స్ ప‌తాకం పై మిర్ర‌ర్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కించిన చిత్రం పిచ్చేక్కిస్తా.. ఈ చిత్రం సెన్సారు కార్యక్రమాలుపూర్తిచేసుకుని వారి ప్రశంశ‌లు పొంది అక్టొబ‌ర్ 10 న విడుద‌ల చేస్తున్నాం. ఎన్‌.కె. హిరిణి లు జంట‌గా న‌టిస్తున్నారు. రోమాంటిక్ కామోడి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని ఆద్యంతం న‌వ్విస్తూ చిన్న సందేశం తో ఆలోచింప‌జేసే చిత్రం గా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.కాజ‌ల్ అగ‌ర్వాల్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన న‌వ‌నీత్ చారి అందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. దీంతో సినిమా మీద అంచ‌నాలు పెరిగాయి. ఈ అంచ‌నాలు అన్నింటిని ఈ సినిమా రీచ్ అవుతుంది. మా సినిమా టైటిల్ ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌మోష‌న్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. త‌ప్ప‌క యూత్ అంద‌రిని ఆక‌ట్టుకుని విజ‌యం సాధిస్తుంద‌ని మా న‌మ్మ‌కం " అని అన్నారు..


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved