pizza
Chiranjeevi to launch music of Sai Dharam Tej's Pilla Nuvvu Leni Jeevitham on 25 October
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా "పిల్లా నువ్వులేని జీవితం" ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

21 October 2014
Hyderabad

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా, రెజినా హీరోయిన్ గా మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్ఠ‌లు గీతా ఆర్ట్స్ మ‌రియు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియోష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం . బన్ని వాసు, శ్రీ హ‌ర్షిత్ లు నిర్మాత‌లు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌కుడు..ఈ ఆడియోని అక్టొబ‌ర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల స‌మ‌క్షంలొ విడుద‌ల చేనున్నారు. డిజిట‌ల్ లాంచ్ లో భాగంగా రెడియో మిర్చి స్టేష‌న్ లో మెగా ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ చిత్రానికి సంబందించి టైటిల్ సాంగ్ ని విడ‌ద‌ల చేశారు.

ఈ సంధ‌ర్బంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ఇదివ‌ర‌కు పూజ‌కి లాంచ్ చేసేవాళ్ళం. త‌రువాత షూటింగ్ లాంచ్ అనేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ గా డిజిట‌ల్ లాంచ్ అంటున్నారు. ఈ లాంచ్ లొ పిల్లా నువ్వు లేని జీవితం అనే చిత్రానికి సంభందించి ఓ సాంగ్ ని విడుద‌ల చేశాం. ఆడియో ని చిరంజీవి గారు, రామ్ చ‌ర‌ణ్ , అల్లు అర్జున్ మ‌రియ మా హీరోలంద‌రూ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నాము. సాయి ధ‌ర‌మ్ తేజ్ చాలా బాగా చేశాడు. ఈ ఆడియో ని 25న విడుద‌ల చేయ‌నున్నాము.. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ.. నాకు మ‌రో జ‌న్మ‌నిచ్చిన అర‌వింద్ గారికి, దిల్ రాజు గారికి నా ధ‌న్య‌వాదాలు. ఆడియో 25న విడుద‌ల‌వుతుంది. ప్ర‌ముఖులు హ‌జ‌ర‌వుతున్నారు. చాలా ఆనందంగా వుంది. నా నిర్మాత‌లు బ‌న్ని వాసు, శ్రీ హ‌ర్షిత్ లు నాకు ఇచ్చిన స‌పోర్ట్ మ‌రిచిపోలేను. అని అన్నారు.

హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ.. మా సినిమా ఆడియో 25న విడ‌ద‌ల‌వుతుంది. అనూప్ సూప‌ర్ ఆడియో ఇచ్చాడు. ఈ అవ‌కాశాన్ని నాకిచ్చిన అంద‌రిని ధ‌న్య‌వాదాలు. అని అన్నారు.

జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రఘు బాబు, దువ్వాసి మోహన్, రాజిత, సత్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న చిత్రానికి, మాటలు : డైమండ్ రత్నం , పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి , చంద్రబోస్, అశోక్ తేజ్, శ్రీమణి, సంగీతం : అనూప్ రూబెన్స్ ,కెమెరా : దాశరధి శివేంద్ర , ఆర్ట్ : రమణ వంక, ఎడిటింగ్ : గౌతంరాజు, ex- ప్రొడ్యూసర్ : సత్య, నిర్మాతలు : బన్నీ వాసు, శ్రీ హర్షిత్, కథ-స్క్రీన్ప్లే -మాటలు-దర్శకత్వం : ఏ.ఎస్ .రవి కుమార్ చౌదరి .


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved