pizza
Pooja Jhaveri about Dwaraka
అన్నీ ర‌కాల‌ పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధం - పూజా ఝ‌వేరి
You are at idlebrain.com > news today >
Follow Us

8 November 2016
Hyderaba
d

విజయ్ దేవర కొండ, పూజా ఝవేరి జంటగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక`. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పూజా ఝ‌వేరితో మంగ‌ళ‌వారం పాత్రికేయుల‌తో సినిమా సంగ‌తుల‌ను ముచ్చ‌టించారు. ..

``ద్వార‌క తెలుగులో నేను న‌టించిన నాలుగో చిత్రం. క‌చ్చితంగా నాకు మంచి బ్రేక్‌నిచ్చే చిత్ర‌మవుతుంది. నేను గుజ‌రాతీ అమ్మాయిని..నా చ‌దువంతా ముంబైలోనే సాగింది. నేను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు చేశాను. కొరియోగ్రాఫ్ కూడా చేస్తాను. చాలా సినిమాల‌ను అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. ఓ సినిమాకు కొరియోగ్ర‌ఫ‌ర్ కూడా ప‌నిచేశాను. ఆ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు. రిన్ సోప్‌కు యాడ్‌లో న‌న్ను చూసిన ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర నాకు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్ప‌డం, క‌థ న‌చ్చ‌డంతో నేను చేయ‌డం జ‌రిగింది. ఇందులో ల‌వ్ అంటే పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని అమ్మాయి రోల్‌లో న‌టించాను. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి కోస్టార్‌.., ఈ సినిమాలో దొంగగా న‌టించాడు. తర్వాత దొంగ బాబాగా మారితే ఎలా ఉంటుంద‌నేదే సినిమా. ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమాను అనుకున్న విధంగా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నా విష‌యానికి వస్తే న‌ట‌న ప‌రంగా అన్నీ ర‌కాల పాత్ర‌లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. హిస్టారిక‌ల్‌, మైథిలాజిక‌ల్ మూవీస్‌లో మంచి పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నాను. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. త‌మిళంలో రెండు సినిమాలు చేశాను. త‌మిళంలో అధ్వ‌ర‌ముర‌ళితో ఓ సినిమా, ధ‌నుష్‌తో తోడ‌రిలో న‌టించాను. ప్ర‌స్తుతం కొత్త చిత్రాలు చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను`` అన్నారు.

Pooja Jhaveri Glam gallery


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved