pizza
Poster of Prabhas as Vikramaditya from Radhe Shyam out now
రాధేశ్యామ్ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోషించిన విక్ర‌మాధిత్య క్యారెక్ట‌ర్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

21 October -2020
Hyderabad

 

In what could be considered as a special treat to Prabhas's fans and followers, the makers of Radhe Shyam, Gopikrishna Movies and UV Creations have unveiled a new poster of the film today. The motion poster of the film with the name 'Beats of Radhe Shyam' will be releasing tomorrow, October 23rd on the occasion of Prabhas's birthday and the makers have provided his fans with a big surprise today by releasing a new poster. Prabhas nails the stylish look as he looks really handsome and is at his mesmerizing best in the poster. With Italian vintage architecture in the background, Prabhas is seen in a blue blazer, seated on a vintage car. This poster takes the expectations on the film to a new level. Prabhas has attained pan-India stardom with Baahubali duology and the anticipation around Radhe Shyam is sky-high. 'JIL' fame Radha Krishna Kumar is directing Radhe Shyam which has Prabhas and Pooja Hegde in the lead roles. "Rebel Star" Dr UV Krishnam Raju garu is presenting this film while Vamsi, Pramod, and Praseeda are producing it under Gopikrishna Movies and UV Creations banner. Noted music director Justin Prabhakaran has been roped in to compose the music for the film in Telugu, Tamil, Kannada, and Malayalam languages. Radhe Shyam is one of the most anticipated pan-India films. The Prabhas starrer will be releasing in Telugu, Tamil, Malayalam, Hindi, and Kannada languages.

Lead cast:

Prabhas, Pooja Hegde, Satyaraj, Bhagyashree, Kunal Roy Kapoor, Jagapati Babu, Jayaram, Sachin Khedekar,Bheena Benarji, Murli Sharma, Shasha Chettri, Priyadarshi, Riddhi Kumar, Satyan, etc.

Technical team:

Presented by: Rebel star, Dr. UV Krishnam Raju
Cinematography: Manoj Paramahamsa
Editor: Kotagiri Venkateswara Rao
Action, stunts: Nick Powell
Sound design: Rasool Pookutty
Choreography: Vaibhavi Merchant
Costume designer: Thota Vijaybhaskar, and Eka Lakhani
VFX supervisor: Kamal Kannan
Executive producer: S Sandeep
Hairstylist: Rohan
Make-up: Tarannum Khan
Stills: Sudarshan Balaji
Publicity designer: Kabilan
PRO: Eluru Sreenu
Casting director: Aadore Mukherjee
Production designer: Ravinder
Producers: Vamsi, Pramod, Praseedha
Director: Radha Krishna Kumar

రాధేశ్యామ్ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోషించిన విక్ర‌మాధిత్య క్యారెక్ట‌ర్ లుక్ విడుద‌ల‌

ప్ర‌భాస్ అభిమానులు కోసం ఈ లుక్ ని విడుద‌ల చేసిన నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి స్పెష‌ల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్ర‌మాధిత్య రోల్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 23న రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ ని విడుద‌ల చేయ‌బోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్ర‌భాస్ కి అడ్వాన్స్ హ్య‌పీ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుద‌ల చేయ‌డం విశేషం. ప్ర‌తి సినిమాకి త‌న హ్యాండ్ స‌మ్ లుక్స్, స్టైలిష్ మేకోవ‌ర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా క‌నిపించ‌బోతున్నారనే విష‌యం ఈ లుక్ చూస్తే అర్ధ‌మైపోతుంది. ఇటలీలో ఉన్న గ్రీకు క‌ట్టడాలు బ్రాక్ డ్రాప్ లో వింటేజ్ కార్ మీద బ్లూ బెజ‌ర్ వేసుకుని స్టైలిష్ గా కుర్చున్న ప్ర‌భాస్ లుక్ అభిమానుల్లో రాధేశ్యామ్ చిత్రం పై మ‌రింత‌గా అంచ‌నాలు పెంచేలా ఉంది. ఇక బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. "రెబ‌ల్‌స్టార్" ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని "రెబ‌ల్‌స్టార్" డాక్టర్ యూ.వి.కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కి సంగీత‌ దర్శ‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ఇట‌లిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో రాధేశ్యామ్ ను విడుద‌ల చేయడానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే, స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రాం, స‌చిన్ ఖేడ్‌క‌ర్‌, భీనా బెన‌ర్జి, ముర‌ళి శ‌ర్మ‌, శాషా ఛ‌త్రి, ప్రియ‌ద‌ర్శి, రిద్దికుమార్‌, స‌త్యాన్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

చిత్ర స‌మ‌ర్ప‌కులు : "రెబ‌ల్‌స్టార్" డాక్ట‌ర్ యు వి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ : కొటగిరి వెంక‌టేశ్వ‌రావు
యాక్ష‌న్‌, స్టంట్స్‌ : నిక్ ప‌వ‌ల్‌
మ్యూజిక్ : జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్
సౌండ్ డిజైన్ : ర‌సూల్ పూకుట్టి
కొరియోగ్ర‌ఫి : వైభ‌వి మ‌ర్చంట్‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌ : తోట విజ‌య భాస్క‌ర్ అండ్ ఎకా ల‌ఖాని
వి ఎఫ్ ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ : క‌మ‌ల్ క‌న్న‌న్‌
ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ : ఎన్‌.సందీప్‌
హెయిర్‌స్టైల్‌‌ : రోహ‌న్ జ‌గ్ట‌ప్‌
మేక‌ప్‌ : త‌ర‌న్నుమ్ ఖాన్
స్టిల్స్‌ : సుద‌ర్శ‌న్ బాలాజి
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌ : క‌బిలాన్‌
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను
కాస్టింగ్ డైర‌క్ట‌ర్‌ : ఆడోర్ ముఖ‌ర్జి
ప్రోడక్షన్ డిజైనర్ : ర‌‌వీంద‌ర్‌
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్రసీధ‌
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్


 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved