pizza
Prakash Raj - Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్
You are at idlebrain.com > news today >
 
Follow Us

01 October -2020
Hyderabad


ముఖ్యమంత్రి కేసీఆర్; ఎంపీ సంతోష్ లు మట్టి మనుషులు. మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతోంది దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి ప్రముఖులందరూ ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి నేడు షాద్ నగర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో తన కుమారునితో కలిసి మొక్కలు నాటిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తనికెళ్ల భరణి ఎప్పుడు కూడా చాలా మంచి చాలెంజ్ లు తీసుకొని నాకు ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా నాకు ఇష్టమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి, నాకు బాసు కెసిఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఈ అయిదు, ఆరు సంవత్సరాలలో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయడం జరిగిందని. దానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి 10 సంవత్సరాల విజన్. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు మట్టి మనుషులు మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఆ మట్టి పరిమళం విలువ వారికి తెలుసు. వారు మట్టితో మాట్లాడుతారు కాబట్టి మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని. మొక్కలు పెంచే బాధ్యత మనందరిదీ ప్రభుత్వం చేస్తుంది కదా అని కాకుండా మనం కూడా బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను తెలంగాణ అంతటా పచ్చదనం చాలా పెరిగిపోయిందని.

పచ్చదనంతో పాటు వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాలు పెరిగిపోయి చెరువులు అలుగులు పారుతున్నాయని దీనివల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ అయిన బంగారు తెలంగాణ సహకారం దగ్గర్లోనే ఉందని తెలిపారు.

మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అందరిచేత మొక్కలు నాటి ఇస్తూ పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని అందులో భాగంగా నా మిత్రుడు మహా నటుడు మోహన్ లాల్, తమిళ్ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అదేవిధంగా అభిమానులకు ప్రేక్షకులు కూడా ఈ చాలెంజ్ ను మీరు స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటి పది మందిచేత మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు.

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved