pizza
Prati Roju Pandaga song shoot in Annapurna studios
అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో సాయి తేజ్, మారుతి, రాశిఖన్నా "ప్రతిరోజు పండగే" సాంగ్ షూటింగ్
You are at idlebrain.com > news today >
Follow Us

23 November, 2019
Hyderabad

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ ను అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్ లో సెట్ వేశారు. థమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్ కోసం సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. శ్రీ జో ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట చిత్రీకరణ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు... ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే కమేసి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు.

GA2UV పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది.

నటీనటులు:
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved